శ్రీ మహా విష్ణువు అవతాల్లో నృసింహా అవతారం ఒకటి. సింహం ముఖంతో, మానవ శరీరంతో ఉగ్ర రూపుడైన నృసింహుడిని కొలిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు నరసింహా ఆలయాలను దర్శించాలని చెబుతూ ఉంటారు. అయితే ఏడాది పోడవునా కాకుండా నృసింహ జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి పలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ ఏడాది మే 21న నరసింహ జయంతిని జరుపుకుంటున్నారు. ఈరోజున ఎలాంటి పూజలు చేస్తారంటే?
2024 మే 21న వైశాఖ శుక్లపక్షం రోజు నరసింహ జయంతిని జరుపుకోవచ్చని చెబుతున్నారు. ఈఱోజు సాయంత్రం 5.39 గంటల నుంచి మే 22 సాయంత్రం 6.47 వరకు జయంతిని నిర్వహిస్తారు. మంగళ వారం కావడంతో నృసింహుడికి అనుకూలమైన రోజుగా భావిస్తున్నారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండే మంగళవారం రోజున నరసింహ జయంతి రావడం మంచిదేనంటున్నారు. నరసింహ జయంతి సందర్భంగా మే 21 న సాయంత్రం నుంచి ఉపవాసం ఉండలి. తిరుమణి, తిరుచూర్ణములతో స్వామి విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు.
నరసింహ జయంతిని నిర్వహించే వారు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. వీలైనంత వరకు పేదలకు దానం చేయాలి. బియ్యం, గోధుమల వంటివి తినకూడదు. చతుర్దశి తిథి వేళ సూర్యాస్తమం లోపు స్వామి వారి పూజను ముగించాలి. ఈరోజున ఇతరులకు కేసరిని స్వామివారికి సమర్పించడం వల్ల కొన్ని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అప్పుల బాధ ఉన్న వారు నరసింహా జయంతి రోజున నెమలి ఈకలను సమర్పిస్తే ఫలితం ఉంటుంది.