https://oktelugu.com/

Koratala Siva: కొరటాల శివ నెక్స్ట్ సీనియర్ హీరోతో సినిమా చేయల్సిందేనా..?

దేవర సినిమా కనక సూపర్ హిట్ అయితే బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే కొరటాల శివ దేవర సినిమాతో పాన్ ఇండియాలో తన పంజాని విసరాలను చూస్తున్నారు.

Written By: , Updated On : May 20, 2024 / 08:19 AM IST
Koratala Siva

Koratala Siva

Follow us on

Koratala Siva: తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదట రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ ఆ తర్వాత మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి తనకంటూ ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందని ప్రతి ఒక్కరు మంచి అంచనాలతో ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఆయన సీనియర్ హీరోలతో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో తెలుగులో ఉన్న టాప్ హీరోలందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోల డేట్స్ ఖాళీ గా లేవు. కాబట్టి ఆయన సీనియర్ హీరోలైన వెంకటేష్ గాని, బాలయ్య, నాగార్జునలలో ఎవరితోనో ఒకరితో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.

మరి ఇక దేవర సినిమా కనక సూపర్ హిట్ అయితే బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే కొరటాల శివ దేవర సినిమాతో పాన్ ఇండియాలో తన పంజాని విసరాలను చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాలను అందించుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయనైతే తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే కొరటాల శివ లాంటి దర్శకుడు ఇప్పటికే తెలుగులో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందినప్పటికీ మిగతా టాప్ డైరెక్టర్స్ తో పోలిస్తే ఈయన కొంతవరకు వెనకబడ్డాడనే చెప్పాలి. ఇక ఆచార్య సినిమాతో భారీగా దెబ్బతిన్న ఈయన సినిమాల పరంగా చాలా వరకు మైనస్ లోకి వెళ్ళాడు. ఇక ఇప్పడు ఈ సినిమా హిట్ ఇస్తుందని తను కూడా నమ్ముతున్నాడు…