https://oktelugu.com/

ఈ కారుకు ఫుల్ డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే 4నెలలు ఆగాల్సిందే..

దేశీయ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి ఆకట్టుకునే మోడల్స్ చాలా వరకు వచ్చాయి. దీని నుంచి రిలీజ్ అయిన క్రెటా బాగా ఆదరణ పొందుతోంది. 2024 ఏప్రిల్ నెలలో ఈ కారు అత్యధికంగా 15,337 యూనిట్లు విక్రయించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 20, 2024 8:09 am
    Hyundai Creta Car bes sale In 2024

    Hyundai Creta Car bes sale In 2024

    Follow us on

    కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో లో బడ్జెట్ తో పాటు మంచి ఫీచర్స్ ఉండే వెహికల్ ను తీసుకొచ్చి ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన కారు కోసం ఎగబడుతున్నారు. ఈ కారులోని ఇంజిన్, ఫీచర్లతో పాటు మైలేజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ మోడల్ ను ఇప్పుడు దక్కించుకోవాలంటే కనీసం 4 నెలలు ఆగాల్సిందే. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

    దేశీయ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి ఆకట్టుకునే మోడల్స్ చాలా వరకు వచ్చాయి. దీని నుంచి రిలీజ్ అయిన క్రెటా బాగా ఆదరణ పొందుతోంది. 2024 ఏప్రిల్ నెలలో ఈ కారు అత్యధికంగా 15,337 యూనిట్లు విక్రయించింది. క్రెటా తరువాత మారుతి గ్రాంట్ విఠారా 7,651 యూనిట్లు అమ్మింది. దీంతో క్రెటాకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థమవుతోంది. ఇంతకీ క్రెటాలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?

    Hyundai Creta facelift

    Hyundai Creta facelift

    హ్యుందాయ్ క్రెటాలో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ , 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజన్లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 158 బిహెచ్ పీ పవర్ తో పాటు 253 గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్ మిషన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో డ్రైవ్ చేయొచ్చు. ఇక డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 114 బీహెచ్ పీ పవర్ తో పాటు 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మూడు ఇంజిన్లతో ఈ మోడల్ ఆకట్టుకుంటోంది.

    క్రెటాలో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్ 2 ADAS, వెంటిలేటేడ్ సీట్లు, బ్లైండ్ స్పాట్ మిర్రర్స్, పనోరమిక్ సన్ రూప్ ఉన్నాయి. ఈమధ్య వినియోగదారులు ఎక్కువగా సన్ రూప్ కోరుకుంటున్నారు. ఈ ఫీచర్ ఇందులో ఉండడం మరింత ప్లస్ పాయింట్ గా మారింది. హ్యాందాయ్ క్రెటాను రూ.11 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ ధర రూ.20.15 లక్షల వరకు అమ్ముతున్నారు. అయితే బాహుబలి లాంటి ఇంజిన్, అప్డేట్ ఫీచర్లతో ఉన్న ఈకారుకు ఫుల్ డిమాండఏ ఏర్పడింది.