Homeఆధ్యాత్మికంToday 4 March 2026 Horoscope: ఈ రెండు రాశుల వారు ఈరోజు జాగ్రత్త..

Today 4 March 2026 Horoscope: ఈ రెండు రాశుల వారు ఈరోజు జాగ్రత్త..

Today 4 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి కొన్ని రాశుల వారు సంయమనం పాటించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి కావడానికి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు నిరాశపరిచే వార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే ఈరోజు వారికి ప్రజల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు అధికారంలో నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. పనులను పెండింగ్లో ఉంచకూడదు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు. తోటి వారి సహాయం ఉండడంతో కొత్త పెట్టుబడును పెడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు మాటల మాధుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. వ్యాపారను ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఒప్పందాలను చేసుకోవడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : గ్రహాల అనుకూలతతో ఈ రాశి వారు ఈ రోజు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఈ ప్రయాణాలతో ఉద్యోగులు లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీరికి అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. తోటి వారి సహకారం ఉన్నట్లు అనిపించినా కూడా కొందరు మోసం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. అయితే కొత్త భాగస్వాములను చేర్చుకునేటప్పుడు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు గణనీయమైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. ఆర్థికపరమైన విషయాలు విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉన్నట్టుండి మోసం చేసే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకూడదు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. ఇలాంటి ఆర్థిక వ్యవహారాలు కొత్త వారితో జరపకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ప్రయాణం చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకూడదు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper
Exit mobile version