https://oktelugu.com/

Horoscope Today: రవియోగం కారణంగా ఈ రెండు రాశులకు ఆర్థిక ప్రయోజనాలు..

ఈ రాశి వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 24, 2024 / 08:14 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనివారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా ఈరోజు రవియోగం ఏర్పడుతంది. దీంతో కర్కాటక , కన్య రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరోవైపు శ్రీకృష్టాష్టమి సమీపిస్తున్న సమయంలో మరికొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

    వృషభ రాశి:
    వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడుతారు. చట్టపరమైన చిక్కులు ఉంటే నేటితో సమసిపోతాయి. సాయంత్ర కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు.

    మిథున రాశి:
    దీర్ఘకాలిక పనులు పూర్తవుతాయి. వ్యాపారులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

    కర్కాటక రాశి:
    ఇంటికి అతిథులు వస్తారు. దీంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. కొత్త పరియాలు ఉంటాయి. దీంతో వ్యాపారుకు సత్సంబంధాలు పెరుగుతాయి. బంధువులతో ఏదైనా గొడవ జరిగితే నేటితో పరిష్కారం అవుతుంది.

    సింహారాశి:
    ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సాయంత్రం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజూ వారీ ఖర్చులు పెరిగిపోతాయి. వ్యాపారులకు సోదరుల మద్దతు పెరిగిపోతుంది.

    కన్య రాశి:
    ఆదా యానికి మించి ఖర్చులు ఉంటాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఇంట్లో వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది. స్థిరమైన ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు శత్రువుల నుంచి సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి.

    వృశ్చిక రాశి:
    శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. సాయంత్రం తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు పెద్దల సలహా అవసరం. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడుతాయి. జీవత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

    మకర రాశి:
    వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. బంధువుల్లో ఒకరితో వివాదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అండతో లాభాలు పొందుతారు. విదేశాలతో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.

    కుంభరాశి:
    ఈ రాశివారు ఈరోజు ఎక్కువగా శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి అండ ఉంటుంది. వ్యాపారులకు నిరంతర లాభాలు వచ్చే అవకాశం. స్నేహితుడి సాయంతో కొన్ని అప్పులు తీరుస్తారు. ఆర్థకంగా బలోపేతం అవుతారు.

    మీనరాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతంది.