Children: చిన్నపిల్లలు మట్టి ఎందుకు తింటారు? దీనికి గల కారణాలేంటో మీకు తెలుసా?

పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపం వల్ల మట్టిని తినడానికి అలవాటు పడతారని వైద్య నిపుణులు అంటున్నారు. మట్టి తినే అలవాటు పోషకాలు తక్కువగా ఉండటం వల్లే వస్తుందట. పిల్లలు మట్టి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Written By: Neelambaram, Updated On : August 23, 2024 7:56 pm

Children

Follow us on

Children: చిన్నతనంలో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. చిన్నప్పుడు వాళ్లను కొట్టలేరు, తిట్టలేరు. ఇంట్లో అన్ని వస్తువులను పడేయడం, పెద్దలను కొట్టడం వంటివి చేస్తుంటారు. పిల్లలను చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్క క్షణం వాళ్లను వదిలితే చాలు.. ఏం చేస్తారో కూడా తెలియదు. పెద్దయ్యాక పెంచడం ఒక ఎత్తు అయితే చిన్నప్పుడు పెంచడం ఇంకో ఎత్తు. పిల్లలను ఎప్పుడు ఇంట్లోనే ఉంచితే వాళ్లకు బయట ప్రపంచం తెలియదని అప్పుడప్పుడు బయటకు పంపుతారు. దీంతో వాళ్లు బయట పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటారు. కానీ మట్టి తినడం అలవాటు చేసుకుంటారు. వాళ్లకి తెలియకుండానే మట్టి తినడం బాగా అలవాటు చేసుకుంటారు. అందులో అంత టేస్ట్ ఏముంటుందో తెలియదు. కానీ పిల్లలు చాలా ఇష్టంగా మట్టి తింటారు. అసలు పిల్లలు మట్టి తినడానికి ఎందుకు ఇష్టపెట్టుకుంటారు. వీటిని తినడం వల్ల పిల్లల్లో వచ్చే సమస్యలేంటో ఈ రోజు తెలుసుకుందాం.

పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపం వల్ల మట్టిని తినడానికి అలవాటు పడతారని వైద్య నిపుణులు అంటున్నారు. మట్టి తినే అలవాటు పోషకాలు తక్కువగా ఉండటం వల్లే వస్తుందట. పిల్లలు మట్టి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మట్టి తినడం వల్ల శరీరంలో కిడ్నీలు దెబ్బతింటాయి. అలాగే రక్తహీనత కూడా ఏర్పడుతుంది. మట్టిలోని కీటకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల పిల్లలకు కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే దంతాలు దెబ్బతినడంతో పాటు మలబద్దకం, ప్రేగులో సమస్యలు కూడా వస్తాయి. ఒకసారి తింటే పర్లేదు. కానీ రోజూ మట్టిని తినడం వల్ల వాళ్ల పెరుగుదలలో కూడా సమస్య వస్తుంది. చిన్నప్పుడే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తే నయం చేయడం చాలా కష్టమవుతుంది. అలాగే వాళ్లకు మట్టి తినడం పెద్దయ్యే వరకు అలవాటు ఉంటుంది. కాబట్టి మట్టికి దూరంగా ఉండేలా పిల్లలను మీరే చూసుకోవాలి.

చాలామంది పిల్లలో ఏడాది నుంచి ఆరేళ్ల వయస్సు లోపల ఉన్నవారిలో పది శాతం నుంచి 30 శాతం మందిలో ఈ సమస్యలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యలు పోషకాల లోపం వల్ల మాత్రమే కాకుండా జన్యుపరంగా కూడా వస్తాయట. మీ పిల్లలు మట్టి తింటున్నట్ల మీరు గమనిస్తే వాళ్లకు పోషకాలు ఉండే ఆహారాన్ని పెట్టండి. తాజా పండ్లు, కూరగాయలు, నువ్వులు, అవిసె గింజలు, బాదం, పెరుగు, పాలు, డ్రైఫ్రూట్స్, నట్స్, గుడ్లు, మాంసం వంటివి పిల్లలకు పెట్టాలి. మట్టి తింటున్నారని పిల్లలను మందగించవద్దు. ఇలా చేస్తే పిల్లలు మొండిగా తయారవుతారు. కాల్షియం, ఐరన్ లోపం ఉందని మీరు వాళ్లకు మంచి ఆహారం ఇవ్వాలి. బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు వంటివి పిల్లలకు పెట్టాలి. వాళ్లను ఒంటరిగా వదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మట్టి తినడం మానేయమని మీరే వాళ్లకు అర్థం అయ్యేటట్లు చెప్పాలి. అప్పుడే వాళ్లు మట్టి తినడం మానేయడానికి ప్రయత్నిస్తారు.