https://oktelugu.com/

Laughing Buddha: లాఫింగ్ బుద్ధ ను ఇంట్లో పెట్టుకోవచ్చా? ప్రయోజనాలు ఏంటి? ఏ ప్రదేశంలో ఉంచాలి?

వాస్తు పరంగా లాఫింగ్ బుద్ధను క్యాష్‌ బాక్స్‌ దగ్గర ఉంచడం చాలా మంచి పని అంటున్నారు నిపుణులు. ఆర్థిక సమృద్ధి, శ్రేయస్సును ఆకర్షించడంలో ఈ స్థానం ఉపయోగపడుతుంది. ఆదాయాన్ని పెంచుతుంది కూడా. ఈ స్థానంలో లాఫింగ్ బుద్దాను పెట్టడం వల్ల తెలివైన ఆర్థిక నిర్ణయాలను ప్రోత్సహిస్తుందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 24, 2024 / 08:42 AM IST

    Laughing Buddha

    Follow us on

    Laughing Buddha: లాఫింగ్ బుద్ధకు వాస్తు శాస్త్రంలో ముఖ్యమైన స్థానం కలదు. ఇల్లు, ఆఫీస్‌, హోటల్‌ రిసెప్షన్‌ వంటి చాలా చోట్ల ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టుకోవడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు. చూడగానే నవ్వు తెప్పించే లాఫింగ్‌ బుద్ధ కేవలం బొమ్మ అనుకోవడం తప్పే. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయట. శ్రేయస్సు, సంతృప్తి, ఆనందానికి చిహ్నంగా భావిస్తుంటారు. ఇల్లు లేదా ఆఫీస్ వాయువ్య మూలలో ఈ విగ్రహాన్ని ఉంచవచ్చు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి కొదవ ఉండదట. అయితే ఈ లాఫింగ్ బుద్ధను ఉంచే చోటును బట్టి ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు వాస్తు నిపుణులు. మరి మంచి ఫలితాల కోసం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    క్యాష్‌ బాక్స్‌ : వాస్తు పరంగా లాఫింగ్ బుద్ధను క్యాష్‌ బాక్స్‌ దగ్గర ఉంచడం చాలా మంచి పని అంటున్నారు నిపుణులు. ఆర్థిక సమృద్ధి, శ్రేయస్సును ఆకర్షించడంలో ఈ స్థానం ఉపయోగపడుతుంది. ఆదాయాన్ని పెంచుతుంది కూడా. ఈ స్థానంలో లాఫింగ్ బుద్దాను పెట్టడం వల్ల తెలివైన ఆర్థిక నిర్ణయాలను ప్రోత్సహిస్తుందట. అంతేకాదు ఆర్థిక నష్టాలు, దురదృష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. స్థిరమైన ఆర్థిక భవిష్యత్తు అందుతుంది. అయితే క్యాష్ బాక్స్ వద్ద లాఫింగ్‌ బుద్ధను ఉంచడం వల్ల మీలో కృతజ్ఞత, దాతృత్వం కూడా పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. అంతేకాదు మంచి రిలేషన్‌షిప్‌లు ఏర్పడుతాయట.

    ప్రవేశ ద్వారం : లాఫింగ్ బుద్ధను ప్రవేశ ద్వారం అంటే ఎంట్రన్స్ హాల్ వద్ద ఉంచడం చాలా ఉత్తమమైన మార్గం. మీ ఇంటికి శ్రేయస్సు, అదృష్టాన్ని, సానుకూలతను ఆహ్వానిస్తుంది ఈ స్థలంలో ఉన్న లాఫింగ్ బుద్ద విగ్రహం. అతిథులను హృదయపూర్వకంగా స్వాగతాన్ని అందిస్తుంది. ప్రతికూల శక్తులకు చెక్ పెడుతుంది. ఫుల్ గా ప్రశాంతత ఉంటుంది. ఎంట్రెన్స్ హాల్ లో ఉన్న బుద్దుడు ఇంటికి పాజిటివిటీ నీ తెస్తాడు. ఇంటి సభ్యులకు శ్రేయస్సు, ఆనందం కూడా అందుతుంది.

    లివింగ్ రూమ్ : లివింగ్‌ రూమ్‌లో లాఫింగ్ బుద్ధను ఉంచితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆనందం, సానుకూలత లభిస్తాయి. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులకు వెల్‌కమింగ్‌ స్పేస్‌గా మారుతుంది అంటున్నారు నిపుణులు. లాఫింగ్ బుద్ధ లివింగ్‌ రూమ్‌లో ఉంటే, ప్రజలు చాలా సన్నిహితంగా ఫీల్‌ అవడానికి ఛాన్స్ ఉంటుందట. మంచి కన్వర్జేషన్‌లు, స్ట్రాంగ్ రిలేషన్స్‌ కూడా మీ సొంతం అవుతాయట. లాఫింగ్ బుద్ధ నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విశ్రాంతి, ప్రశాంతత, ప్రియమైనవారితో డీప్‌ రిలేషన్‌ లకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. లివింగ్‌ రూమ్‌ని శాంతియుత, సంతోషకరమైన ప్రదేశంగా మార్చడంలో ఈ ప్రాంతంలోని లాఫింగ్ బుద్ధ మంచి పాత్రను పోషిస్తారు.

    ఆగ్నేయ మూల: ఆగ్నేయ మూలలో లాఫింగ్ బుద్ధ ను ఉంచితే సంపద, ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు పెరుగుతుంది. ఆదాయం, ఆస్తులు కూడా వృద్ధి చెందుతాయి. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచం ఉండదట. ఆగ్నేయ మూలలో లాఫింగ్ బుద్దను ఉంచడం వల్ల క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌, ఎంట్రప్రెన్యూరల్‌ స్పిరిట్‌ లు పెరుగుతాయి. కొత్త అవకాశాలు, విజయాలకు దారి తీస్తుంది అంటున్నారు నిపుణులు. సౌకర్యవంతమైన, సంపన్నమైన జీవనశైలి మీ సొంతం అవుతుంది. జీవితంలో ఆనందం వస్తుందట.