Goddess Lakshmi : ఈ పదార్థాలు ఇతరులకు ఇస్తే… వాటితో పాటు లక్ష్మీదేవి వెళ్లిపోతుంది..

Goddess Lakshmi : ఇలా కాకుండా కొందరు వ్యతిరేక పనులు చేస్తారు. సాయంత్రం సమయంలో నిద్రించడం, సోమరితనంతో ఉన్న ఇంట్లో నుంచి కూడా లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.

Written By: NARESH, Updated On : June 14, 2024 6:21 pm

Goddess Lakshmi

Follow us on

Goddess Lakshmi : ప్రతి ఇంట్లో సంతోష వాతావరణం ఉండాలని కోరుకుంటారు. ఇల్లు ఆదాయం, సంతోషంగా ఉండాలంటే లక్ష్మీ దేవి కొలువై ఉండాలి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కొన్ని పదార్థాలకు అనుగుణంగా ఉంటుంది. దీంతో ఆ పదార్థాలు ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉండేలా చూసుకోవాలి. పొరపాటున ఇవి ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెడుతుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. ఇంతకీ ఎటువంటి పదార్థాలను ఇతరులకు ఇవ్వకూడదు.. ఇస్తే ఏమవుతుంది?

కొందరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తుంటారు. కొందరు యాగాలు చేస్తుంటారు. కానీ ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆ మాత ఆగ్రహానికి గురవుతారు. ఇంట్లో లక్ష్మీ దేవత పూజ గదిలో మాత్రమే కాకుండా కొన్ని వస్తువుల్లో కొలువై ఉంటుంది. వాటిలో బంగారం, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం అని చాలా మందికి తెలుసు. కానీ జీలకర్ర ఉప్పు వంటి పదార్థాల్లో కూడా లక్ష్మీ కొలువై ఉంటుంది. అయితే చాలా మంది శుశక్రవారం నాడు ఉప్పు, జీలకర్రను ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని అంటున్నారు.

పరిశుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి తాండవిస్తుంది. అందువల్ల ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలి. అలాగే మనిషి ప్రవర్తన బాగుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. పెద్దలను, గురువులతో పాటు తల్లిదండ్రులను గౌరవించే వారి పట్ల ఆ మాత ఆశీస్సలు ఉంటాయి. ఇలా కాకుండా కొందరు వ్యతిరేక పనులు చేస్తారు. సాయంత్రం సమయంలో నిద్రించడం, సోమరితనంతో ఉన్న ఇంట్లో నుంచి కూడా లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.