Dog Temple : సాధారణంగా ఎక్కడైనా దేవతలకు గుడి కడుతారు. లేదా సమాజానికి చేసిన సేవను గుర్తు చూస్తే వారి పేరిట ఆలయాలు నిర్మిస్తారు. కానీ ఓ గ్రామంలో కుక్కలకు గుడి కట్టారు. అంతేకాకుండా ఇవి తమ ఆరాధ్య దైవమంటూ నిత్యం పూజలు చేస్తున్నారు. సంవత్సరానికి ఓసారి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శునకాలను పూజించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అంతేకాకుండా ఆ ఆలయం నిర్మించడానికి ఓ చరిత్ర ఉంది. ఇంతకీ ఈ కుక్కల ఆలయం ఎక్కడ ఉంది? దాని వివరాలేంటి?
భారతదేశంలో వివిధ ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలోని ఆలయంలోని ఓ ఆలయంలో దేవళ్లకు బదులు శునకాల విగ్రహాలు ఉన్నాయి. చన్నపట్న జిల్లాలో అగ్రహార వలగెరెహల్లి అనే గ్రామం ఉంది. చెన్నపట్న నగరంలో బొమ్మల పట్టణం అని కూడా పిలుస్తారు. ఇది బెంగుళూరు నగరానిని దాదాపు 60 కిలోమటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శునకాలకు ప్రత్యేకంగా ఆలయాన్ని కట్టించారు.
కుక్కల కోసం ప్రత్యేకంగా ఆలయం కట్టడం వెనుక ఓ చరిత్ర ఉంది. గ్రామంలో ఎప్పుడూ తిరిగే రెండు శునకాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. అయితే ఇవి చనిపోయాయని గ్రామస్థులు అనుకున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలలో ఓ దేవత కనిపించి గ్రామస్థుల రక్షణ కోసం తప్పిపోయిన కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని తెలిపింది. దీంతో దేవత చెప్పిన ప్రకారం ఇక్కడ 2010లో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతీ ఏడాది భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామాన్ని ఈ కుక్కలే కాపాడుతున్నాయని గ్రామస్థులు భావిస్తారు. అంతేకాకుండా ఇక్కడున్న ఇళ్లల్లో ఉండే ప్రతికూల వాతావరణం తొలగిపోతుందని భావిస్తారు.