Ugadi 2024: తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక.. అసలు కథ ఏమిటో తెలుసా..

కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత మకర రాశిలో ఆగమనం పొందే వరకు మొత్తం ఆరు నెలల కాలం పడుతుంది. ఈ ఆరు నెలలను ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిర మాసాలలో కొంత భాగం వరకు ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 9, 2024 4:51 pm

Ugadi 2024

Follow us on

Ugadi 2024: ఉగాదిని తెలుగు సంవత్సరానికి ప్రారంభంగా జరుపుకుంటా. యుగ+ ఆది= ఉగాదిగా మారిపోయింది. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళతమైన పచ్చడిని తాగడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందులో ఉన్న ఆరు రుచులు జీవితంలో ఉన్న కష్టం, సుఖం, దుఃఖం, బాధ, ఆనందం, ఉత్సాహానికి ప్రతీకలని పెద్దలు చెబుతుంటారు.. అందు గురించే ఉగాదినాడు తీసుకునే పచ్చడి ద్వారా జీవిత పరమార్ధం అర్థమవుతుందని అంటుంటారు. ఉగాది పచ్చడి తర్వాత అందరూ పంచాంగ శ్రవణాన్ని వింటుంటారు. పంచాంగ శ్రవణంలో పుట్టిన తేదీ, సమయం, నక్షత్ర గమనం ప్రకారం రాశిని నిర్ణయిస్తారు. ఆ రాశి గల వారి జీవిత వైచిత్రి ఆ ఏడాది ఎలా ఉంటుందో పంచాంగం ద్వారా వివరిస్తారు.. కేవలం పచ్చడి, పంచాంగ శ్రవణం మాత్రమే కాదు.. ఉగాది ప్రారంభానికి సంబంధించి సంవత్సరం కూడా అత్యంత ముఖ్యం. తెలుగు సంవత్సరాలు 60 గా నిర్ణయించిన నేపథ్యంలో.. వాటి వెనుక విశిష్టమైన చరిత్ర దాగి ఉంది.

ఇంతకీ ఏంటి ఆ చరిత్ర

పురాణ కాలంలో నారదుడు ఒకసారి విష్ణువు మాయ వల్ల స్త్రీ అవతారం ఎత్తుతాడు.. ఒక రాజును వివాహం చేసుకుంటాడు. ఆ రాజు వల్ల ఆ స్త్రీ అరవైమంది సంతానానికి జన్మనిస్తుంది. అనివార్య పరిస్థితుల్లో రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో ప్రత్యర్థి చేతిలో ఆ రాజు, 60 మంది సంతానం కన్నుమూస్తారు. తన సంతానం మొత్తం కన్నుమూయడంతో ఆ స్త్రీ విష్ణుమూర్తి శరణు వేడుకుంటుంది.. దీంతో ప్రత్యక్షమైన విష్ణుమూర్తి ” నీ సంతానం కన్నుమూసినందువల్ల నువ్వు దుఃఖించాల్సిన పనిలేదు.. కాలాను క్రమంలో నీ పిల్లలు 60 సంవత్సరాలుగా పరిభమిస్తుంటారు” అని పరమిస్తాడు. ఆ 60 మంది పిల్లల పేర్లే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

ఆ సంవత్సరాలు ఏంటంటే..

1, ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. అంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాధి, 14. విక్రయ, 15, వృక్ష, 16. చిత్ర భాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వ జిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మధ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంభి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభ కృత్, 37. శోభ కృత్, 38. క్రోధి, 39. విశ్వా వసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. విరోధికృత్, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 50. రాక్షస, 51. నల, 52. పింగళ, 53. కాళ యుక్త, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేస్తే దానిని ఆయనం అని పిలుస్తారు. ఒక సంవత్సరంలో రెండు ఆయనాలు ఉంటాయి.

ఉత్తరాయణం:

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఆరు నెలల తర్వాత కర్కాటక రాశిలోకి ప్రయాణం సాగిస్తాడు. ఈ ఆరు నెలల కాలాన్ని చైత్రం, వైశాఖం, జేష్ట్యం, ఆషాడ మాసాలలో కొంత భాగం, పుష్యం, మాఘం, ఫాల్గుణం మాసాలలో ఉత్తరాయణం ఉంటుంది.

దక్షిణాయణం

కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత మకర రాశిలో ఆగమనం పొందే వరకు మొత్తం ఆరు నెలల కాలం పడుతుంది. ఈ ఆరు నెలలను ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిర మాసాలలో కొంత భాగం వరకు ఉంటుంది.

ఇక సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విడదీసి.. వాటికి రుతువులు అని పేరు పెట్టారు. ఆ రుతువులు ఆరు.. వసంతం, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంతం, శిశిరం..

ఇక సంవత్సరాన్ని 12 భాగాలుగా విడగొడితే అది మాసం అవుతుంది. అవి.. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం, శ్రావణం, భద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.. ఇలా రెండు మాసాలు కలిసి ఒక రుతువు అవుతాయి.

12 మాసాలలో ప్రతీ మాసాన్ని రెండు పక్షాలుగా విడగొట్టారు. అవి కృష్ణపక్షం.. ఇది అమావాస్య 15 రోజులకు ప్రతీక. శుక్లపక్షం పౌర్ణమి 15 రోజులకు ప్రతీక.. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం.. పౌర్ణమి మరుసటి రోజు పాడ్యమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం అని పిలుస్తారు. ఒక పక్షపు రోజులకు 15 తిధులు ఉంటాయని చరిత్ర చెబుతోంది. అవి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య.. ఇక ఇవే కాకుండా ఒక పక్షానికి రెండు వారాలు ఉంటాయి. ఒక వారానికి ఏడు రోజులు ఉంటాయి. ఒక రోజుకు 8 జాములు ఉంటాయి. ఒక జామకు మూడు గంటలు.. ఒక గంటకు 60 నిమిషాలు.. ఇలా ప్రతి నిమిషానికి వచ్చే నక్షత్రంతో సహా పంచాంగం అనేది అత్యంత కచ్చితత్వంతో ఉంటుంది. భారత యుద్ధం జరిగే సమయంలో సూర్య గ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగింది అంటే పంచాంగం ఎంత కచ్చితమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.