Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..

చాలా మంది అవగాహన లేకుండా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ మెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకుంటున్నారు. దీనిని ఎంచుకోవడం వల్ల కమీషన్ కట్ అవుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్ ప్లాన్ ను ఎంచుకోవడం వల్ల ఎవరూ కమీషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు.

Written By: Chai Muchhata, Updated On : April 9, 2024 3:54 pm

Mutual Funds

Follow us on

Mutual Funds:  లాంగ్ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలని కోరుకునేవారు ఈ మధ్య ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా మార్కెట్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మినిమం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ పై కొన్ని సంస్థలు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాయి కూడా.. దీంతో చాలా మంది చిట్టీలు కట్టే వారు వాటిని మానుకొని సింపుల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్)కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ కూడా కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కొన్ని వేల రూపాయలు లాస్ అవుతున్నారు. కొంచెం అవగాహన ద్వారా పెట్టుబుడి పెడితే ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.. అదెలాగంటే?

ఒకప్పుడు డబ్బులు సేవ్ చేయడం లేదా పెట్టుబడి పెట్టడానికి ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా చిట్టీలను మాత్రమే నమ్ముకునేవారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల తో కొన్ని సంవత్సరాల తరువాత డబుల్ ప్రాఫిట్స్ ఉండేవి. ఇక చిట్టీలతో కాస్త లాభం మాత్రమే ఉండేది. అయితే స్టాక్ మార్కెట్ ద్వారా సింపుల్ గా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ను ఫాలో అవుతున్నారు. కొందరు ట్రేడింగ్ నిపుణులు సిప్ పై అవగాహన కల్పిస్తూ ఇన్వెస్ట్ మెంట్ చేయిస్తున్నారు.

సిప్ లో ఇన్వెస్ట్ మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి.. ఒకేసారి కొంత పెట్టుబడి పెట్టి లాంగ్ పీరియడ్ వరకు వేచి ఉండడం. మరొకటి నెలనెలా కొంత మొత్తాన్ని సేవ్ చేయడం.. ఎలాగైనా కనీసం రెండు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయగలిగితే ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి వరకు తెలిసిన వారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబుడులు పెడుతున్నారు. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నారు.

కొందరు స్టాక్ బ్రోకర్ ద్వారా కాకుండా నేరుగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మ్యూచువల్ పండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. కానీ చాలా మంది అవగాహన లేకుండా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ మెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకుంటున్నారు. దీనిని ఎంచుకోవడం వల్ల కమీషన్ కట్ అవుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్ ప్లాన్ ను ఎంచుకోవడం వల్ల ఎవరూ కమీషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఇలాంటి మిస్టేక్ చేస్తే రెండు సంవత్సరాలకు కనీసం రూ.5 వేల వరకు లాస్ అవుతారు.