Goat Life OTT: మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్. ఆడుజీవితం అనేది ట్యాగ్ లైన్. 28 మార్చిన వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈ మూవీ మలయాళంలో భారీ విజయం అందుకుంది. అన్ని భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ది గోట్ లైఫ్ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ మలయాళ రచయిత బన్నీ డేనియల్ ఆడు జీవితం టైటిల్ తో ఒక నవల రాశారు. ఈ నవల సౌదీ అరేబియాలో చిక్కుకుని దుర్భర జీవితం అనుభవించిన నజీమ్ మహ్మద్ కథ.
నజీమ్ మహ్మద్ డబ్బులు సంపాదించి కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే కోరికతో సౌదీ అరేబియా వెళతాడు. ఓ ఏజెంట్ ద్వారా ఉద్యోగం ఉందని నమ్మి వెళ్లిన నజీమ్ మోసపోయానని తెలుసుకుంటాడు. అరబ్ షేక్ నజీమ్ ని ఎడారిలో గొర్రెల కాపరిగా నియమించుకుంటారు. సరైన తిండి, నీళ్లు లేకుండా గొర్రెలు కాస్తూ ఏడాదిలో ఒంటరి జీవితం గడుపుతాడు. ఎట్టకేలకు ఆ బానిస బ్రతుకు నుండి తప్పించుకుంటాడు.
ఆడుజీవితం నావెల్ ని సినిమాగా చేయాలని 2008లో దర్శకుడు బ్లెస్సీ భావించాడు. మొదటి సూర్యను హీరోగా అనుకున్నాడు. ఆయన బిజీగా ఉండి ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడు. అప్పుడు పృథ్విరాజ్ సుకుమారన్ వద్దకు ఈ కథ వెళ్ళింది. అయితే బడ్జెట్ ఎక్కువ కావాలని బ్లెస్సీ భావించాడు. త్రీడిలో షూట్ చేయాలని అనుకున్నాడు. మలయాళ చిత్రం మార్కెట్ రీత్యా నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి వెళ్ళడానికి ఏకంగా 16 ఏళ్ల సమయం పట్టింది.
ఈ ప్రాజెక్ట్ కోసం పృథ్విరాజ్ సుకుమార్ 30 కేజీలు బరువు తగ్గాడట. అంత కమిటెడ్ ది గోట్ లైఫ్ మూవీ చేశాడు పృథ్విరాజ్. కాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతుంది.మే 10 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. అక్కడ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పృథ్విరాజ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ది గోట్ లైఫ్ మూవీలో పృథ్విరాజ్ కి జంటగా అమలాపాల్ నటించింది.