Dhanteras: ధంతేరాస్ రోజు ఈ వస్తువులు కొన్నారో.. ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేయడం ఫిక్స్!

ధంతేరాస్ రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు. పొరపాటున కొని తీసుకొచ్చారనుకోండి.. ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. మరి ధంతేరాస్ రోజు కొనకూడని ఆ వస్తువులేంటో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 27, 2024 8:45 pm

dhanteras

Follow us on

Dhanteras: అందరూ ఎదురు చూసే దీపావళి పండుగ రానే వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. సాధారణంగా దీపావళి పండుగను ఒక రోజు మాత్రమే జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం దీపావళిని ఐదు రోజుల ముందు నుంచే జరుపుకుంటారు. ఇందులో భాగంగా ధంతేరాస్‌ను ఉత్తర భారతదేశం ప్రజలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ ధంతేరాస్‌ను ఎవరూ జరుపుకోరు. కానీ ఉత్తర భారతదేశంలో ప్రతీ ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. ధంతేరాస్ పూజ చేయడం వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ధంతేరాస్ పూజ చేయడం వల్ల వెంటన విముక్తి పొందుతారు. అయితే ఈ ధంతేరాస్ అనేది దీపావళి పండుగకి మూడు రోజుల ముందు వస్తుంది. అసలు దీపావళి పండుగ ధంతేరాస్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ధంతేరాస్ పండుగను అక్టోబర్ 29న జరుపుకుంటారు. ఈ పండుగను తప్పకుండా ప్రతీ ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఈ ధంతేరాస్ రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు. పొరపాటున కొని తీసుకొచ్చారనుకోండి.. ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. మరి ధంతేరాస్ రోజు కొనకూడని ఆ వస్తువులేంటో తెలుసుకుందాం.

గాజు వస్తువులు
ధంతేరాస్ రోజు గాజు వస్తువులను అసలు కొని ఇంటికి తీసుకురాకూడదు. వీటిని కొని తీసుకురావడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుందని పండితులు అంటున్నారు. కాబట్టి ధంతేరాస్ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు వస్తువులను కొనవద్దు.

ఇనుము వస్తువులు
ఇనుము వస్తువులను ధంతేరాస్ రోజు కొనకూడదు. ఎందుకంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. వీటికి బదులు మట్టి పాత్రలను కొని ఇంటికి తీసుకురావడం మంచిదని పండితులు అంటున్నారు.

నూనె ఇంటికి తీసుకురాకూడదు
ధంతేరాస్ రోజు నూనె కొని ఇంటికి తీసుకురాకూడదు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట. పూజకు కావాల్సిన నూనెను ముందుగానే తెచ్చి ఉంచుకోవాలని పండితులు అంటున్నారు.

నలుపు రంగు వస్తువులు
సాధారణంగా నలుపును అశుభంగా పరిగణిస్తారు. అందులో ధంతేరాస్ రోజు నలుపు వస్తువులను కొనడం వల్ల అనుకున్న పనులు సక్రమంగా కావని పండితులు అంటున్నారు. కాబట్టి ధంతేరాస్ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయవద్దు.

పదునుగా ఉన్న వస్తువులు
ధంతేరాస్ పూజ చాలా ముఖ్యమైనది. ఈ రోజు కొత్త వస్తువులు కొనాలని కత్తి, చాకు, సూది వంటి పదునైన వస్తువులను కొనకూడదని పండితులు అంటున్నారు. ఇలాంటి పదునైన వస్తువులు కొనడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయని పండితులు అంటున్నారు. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తీసుకురావద్దు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.