https://oktelugu.com/

Chanakya Neeti : ఈ ఐదుగురు వ్యక్తులను బుట్టలో వేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం.. ఒక వ్యక్తి మూర్ఖుడు అయితే.. ఆ వ్యక్తిని ఆకర్షించడానికి వారి చెప్పిందే వినాలి. కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు కొందరు ఎక్కువగా వాదిస్తారు. అలా వాదించేవారితోనూ అవసరం ఏర్పడుతుంది. అయితే వారిని బుట్టలో వేసుకోవాలంటే వారికి అనుగుణంగ ఉండాలి. వారు చెప్పింది వింటే ఆ తరువాత మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2024 10:47 am
    Chanakya neethi

    Chanakya neethi

    Follow us on

    Chanakya Neeti : ఈ ప్రపంచంలో మనుషులు కోట్లాది మంది ఉన్నా.. ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంటారు. దాదాపుగా ఒక వ్యక్తికి ఉన్న గుణాలు మరో వ్యక్తికి ఉండకపోవచ్చు. దీంతో ఒక వ్యక్తి అవసరం మరో వ్యక్తికి రావొచ్చు. అయితే ఇలా మరో వ్యక్తిని సాయం అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు. కొందరు మంచి వారు ఉండొచ్చు.. మరికొందరు మూర్ఖులు అయి ఉంటారు.. అయితే అందరినీ ఆకట్టుకోవడానికి ఎదుటి వారిని అర్థం చేసుకునే గుణం ఉండాలి. లేదా కొన్ని సూత్రాలు పాటించాలి. అపర చాణక్యుడు వివిధ రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులను ఆకట్టుకోవడానికి కొన్ని సూత్రాలను చెప్పాడు. ఏ వ్యక్తి ఎలాంటి వాడో? అతనిని ఏ విధంగా ఆకర్షించాలో చెప్పాడు. ఆవేంటో చూద్దాం.

    చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం.. ఒక వ్యక్తి మూర్ఖుడు అయితే.. ఆ వ్యక్తిని ఆకర్షించడానికి వారి చెప్పిందే వినాలి. కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు కొందరు ఎక్కువగా వాదిస్తారు. అలా వాదించేవారితోనూ అవసరం ఏర్పడుతుంది. అయితే వారిని బుట్టలో వేసుకోవాలంటే వారికి అనుగుణంగ ఉండాలి. వారు చెప్పింది వింటే ఆ తరువాత మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.

    కొంత మంది అత్యాశను కలిగి ఉంటారు. కొన్ని విషయాల పట్ల తొందరగా రియాక్టవుతారు. కానీ వీరు ఎక్కడగా నిలకడతో ఉండరు. ఒక్కచోట నిలవరు. కానీ ఇలాంటి వారితో అవసరం ఏర్పడినప్పుడు వారిని ఎలా ఆకర్షించాలో చాణక్యుడు చెప్పడు. అత్యాశ కల వారికి డబ్బుపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతీది అనుభవించాలని, దానికి డబ్బు అవసరమని వీరు భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని డబ్బుతో కొనేయచ్చు. లేదా వారు ఎలాంటి వాటిపై మక్కువ పెంచుకుంటున్నారో ఆ వస్తువులను ఇవ్వడం ద్వారా వారిని బుట్టలో వేసుకోవచ్చు.

    ముర్ఖులు, అత్యాశవారికి భిన్నంగా మంచి వారు ఉంటారు. వీరు ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు. ఇలాంటి వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రయోగాలు అస్సులు చేయనక్కర్లేదు. వారితో నిజాయితీగా ఉంటూ, నిజం చెబితే చాలు.. మీకు అవసరమైన పని చేస్తారు. అయితే పొరపాటున కూడా వారి మనసు నొప్పిస్తే మీకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆ తరువాత వారిని మచ్చిక చేసుకోవడం కష్టంగా మారుతుంది.

    ప్రేమతో పనిచేసేవారు కూడా కొందరు అంటారు. ఇలాంటి వారితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే వారు కష్టాలు చెబితే వినాలి. వారు ఏదైనా విషయం చెబుతూ ఉంటే అడ్డు చెబితే వారికి కోపం వస్తుంది. దీంతో వారు మీ మాట వినలేదు. దీంతో వారితో మీకు ఎలాంటి అవసరం ఉన్నా పనిచేయరు. అందువల్ల ఇలాంటి వారితో ప్రేమగా మెదిలే ప్రయత్నం చేయాలి.

    కొందరు ఎప్పుడూ కోపంతో ఉంటారు. ప్రతీ దానికి చికాకును కలిగించుకుంటారు. ఇలాంటి వారు ఎంత కోపంగా మాట్లాడినా మీరు ప్రశాంతంగా కనిపిస్తే వారి కోపం వెంటనే తగ్గుతుంది. కోపంగా ఉన్న వ్యక్తిపై కోప్పడితే మరింత కోపం పెరుగుతుంది. అదే ప్రశాంతంగా మాట్లాడితే కోపాన్ని చల్లార్చొచ్చు. అందువల్ల ప్రశాంతంగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవచ్చు.