Balineni Srinivas Reddy Political Future: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఇటువంటి తరుణంలో నాయకత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. కానీ అక్కడక్కడ నేతల్లో విభేదాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒంగోలులో టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ జనసేన నేత అన్నట్టు పరిస్థితి మారింది. గత రెండు రోజులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి బాలినేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విభేదించి జనసేనలోకి వచ్చారు. అటువంటి నేత ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తుండడం చూస్తుంటే మాత్రం.. కూటమిలో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ కు తెలిసైన ఉండాలి. లేకుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏదో ఒక కఠిన నిర్ణయానికి వచ్చినట్టైనా ఉండాలి. అయితే దామచర్ల జనార్ధనతో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైరం ఉంది. పైగా తన పోరాటానికి జనసేనతో సంబంధం లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం విశేషం.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం..
మొన్నటి ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( balineni Srinivas Reddy )వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా దామచర్ల జనార్ధన బరిలో దిగారు. జనార్ధన భారీ విజయం సాధించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన లో చేరారు. అయితే జనసేనలో పదవి ఊహించి బాలినేని వచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఒకటి రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ బాలినేని విషయంలో సానుకూలంగా స్పందించారు. దీంతో జనసేనలో చేరితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించి బాలినేని గ్లాస్ పార్టీలో చేరారు. అయితే చేరి ఏడాది దాటుతోంది కానీ.. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా పెద్దగా ప్రాధాన్యత లేదు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి. ఆపై ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే జనార్ధన తో పాటు ఇతర జనసేన నేతలు తన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
* వైసీపీలో గౌరవం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గౌరవ మర్యాదలు బాగానే అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి గెలిచేసరికి బాలినేనిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అవిశ్వాసంతోనే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే మంత్రి పదవి వదులుకొని మరి ఆ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఎనలేని ప్రాధాన్యమిచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి. కానీ మంత్రివర్గ విస్తరణలో పదవి తీసేసరికి అసంతృప్తికి గురైన ఆయన అప్పటినుంచి అలకపాన్పు ఎక్కారు. పైగా తన సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి తో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉన్న అనుకోని పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన వీడాల్సి వచ్చింది. అయితే అటు జనసేనలో చేరిన తగిన ప్రాధాన్యం లేదు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఎన్నో రకాల విమర్శలు చేశారు బాలినేని. పైగా వైవి సుబ్బారెడ్డి తో ఉన్న బంధుత్వం మరిచి సైతం విమర్శలు చేసేసారు.
* కుమారుడి కోసం..
బాలినేని తన కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని చూసారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఆ చాన్స్ ఉండేది. జనసేనలో చూస్తే ఆ అవకాశమే లేదనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన ఉన్నారు. ఆయనను కాదని ఇక్కడ జనసేనకు టికెట్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ పట్టుబడతారా? అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే తాడోపేడో అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఏ పార్టీకి చెందకుండా అన్నట్టు పరిస్థితి మారింది అని ఆయన అనుచరుల వద్ద బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి బాలినేని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..