https://oktelugu.com/

Vijay Sethupathi: నేను కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమానే నన్ను ఆదుకుంది : విజయ్ సేతుపతి

నటుడిగా ఆయనని సినిమా సినిమాకి ఎంతో పరివర్తన చెందినవాడిలాగా తయారు చేసింది. కేవలం హీరో గా మాత్రమే కాదు, కథ నచ్చితే నెగటివ్ రోల్స్ చెయ్యడానికి కూడా ఏమాత్రం వెనకాడని నటుడు ఆయన. హీరో గా వరుస సక్సెస్ లు అందుకుంటున్న సమయం లో కూడా ఆయన పేట,మాస్టర్, ఉప్పెన మరియు జవాన్ వంటి చిత్రాలలో విలన్ రోల్స్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 12, 2024 11:19 am
    Vijay Sethupathi

    Vijay Sethupathi

    Follow us on

    Vijay Sethupathi: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇప్పుడున్న పోటీ వాతావరణం లో సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో సామాన్యుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు పెద్ద స్టార్ హీరోగా ఎదిగిన హీరోలలో ఒకరు విజయ్ సేతుపతి. ఈయన కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించేవాడు. అందం, ఫిజిక్ లేకపోయినప్పటికీ విజయ్ సేతుపతి లో అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉండడంతో అతనితో వైవిద్యభరితమైన సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. అలా ప్రారంభమైన విజయ్ సేతుపతి కెరీర్, ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగింది.

    నటుడిగా ఆయనని సినిమా సినిమాకి ఎంతో పరివర్తన చెందినవాడిలాగా తయారు చేసింది. కేవలం హీరో గా మాత్రమే కాదు, కథ నచ్చితే నెగటివ్ రోల్స్ చెయ్యడానికి కూడా ఏమాత్రం వెనకాడని నటుడు ఆయన. హీరో గా వరుస సక్సెస్ లు అందుకుంటున్న సమయం లో కూడా ఆయన పేట,మాస్టర్, ఉప్పెన మరియు జవాన్ వంటి చిత్రాలలో విలన్ రోల్స్ చేసాడు. ఇలా నటనకి ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర అయిన చెయ్యడానికి వెనుకాడడు. అందుకే ఆయనని నేటి తరం కమల్ హాసన్ అని తమిళం లో పిలుస్తుంటారు. ఇకపోతే విజయ్ సేతుపతి తెలుగు సినిమాలను కూడా బాగా చూస్తుంటాడు. రీసెంట్ గా ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నాకు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అతడు’ సినిమా అంటే ఎంతో ఇష్టం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతీ రోజు ‘అతడు’ సినిమా చూసేవాడిని. ఆ చిత్రం లో ప్రారంభ సన్నివేశం నుండి చివరి వరకు ప్రతీ డైలాగ్, ప్రతీ ఫ్రేమ్ నాకు గుర్తుంది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ చెవిలో అమృతం పోసినట్టు ఉంటాయి. అలాగే మహేష్ బాబు నటన, త్రిష తో ఆయన చేసిన రొమాన్స్ చూసేందుకు ఎంతో బాగా అనిపించేది. ఈ సినిమా చూసేటప్పుడు నా కష్టాలన్నీ మర్చిపోయి, కాసేపు రిలాక్స్ అవుతుంటాను. అలాంటి చిత్రం ఇచ్చినందుకు మహేష్ బాబు – త్రివిక్రమ్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.

    ఇకపోతే విజయ్ సేతుపతి రీసెంట్ గానే తన 50 వ సినిమాగా ‘మహారాజా’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా విజయ్ సేతుపతి కి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ని ఇచ్చింది. ఇటీవలే ఓటీటీ లో కూడా విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.