Homeఅంతర్జాతీయంIran Shocks Pakistan: నంగనాచి పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చిన ఇరాన్‌.. ఇక మూల్యం చెల్లించుకోవాల్సిందే!

Iran Shocks Pakistan: నంగనాచి పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చిన ఇరాన్‌.. ఇక మూల్యం చెల్లించుకోవాల్సిందే!

Iran Shocks Pakistan: పాకిస్తాన్‌.. డబ్బుల కోసం ఏ పని అయినా చేసే దేశం. చివరకు సైన్యాన్ని కూడా అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైన దేశం. డబ్బుల కోసం దుబాయ్‌తో, యూఏఈతో స్నేహం చేసింది. డిఫెన్స్‌ డీల్‌ చేసుకుంది. కానీ, ఆపదలో వారిని ఆగుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సహకరిస్తూ సాటి ఇస్లాం దేశమైన ఇరాన్‌కు రంజాన్‌ మాసంలో వెన్నుపోటు పొడిచింది. ఈ విషయాన్ని ఇరాన్‌ను చెందిన ఐఆర్‌జీసీ గుర్తించింది. ఇప్పటికే తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌ దాడులతో ఒకవైపు, ఆఫ్గానిస్తాన్‌ తాలిబాన్ల దాడులతో మరోవైపు.. బలూచిస్తాన్‌ బిబరేషన్‌ ఆర్మీ తిరుగుబాట్లతో ఇంకోవైపు సమస్య ఎదుర్కొంటోంది. తాజాగా ఇరాన్‌తో సమస్య కొని తెచ్చుకుంది. .

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

ఇరాన్‌ కొత్త ఆరోపణలు
ఐఆర్‌జీసీ ప్రతినిధి మార్చి 3న పాకిస్తాన్‌ గ్వాదర్‌ పోర్టు ద్వారా అమెరికా–ఇజ్రాయెల్‌ తమపై దాడిచేసినట్లు ప్రకటించాడు. తూర్పు, ఉత్తర దాడులు పాక్‌ భూభాగం నుంచే జరిగాయని, ఈటర్న్‌–నార్తన్‌ బేస్‌లపై నౌకల దాడులకు పాక్‌ మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. గతేడాది జూన్‌లో కూడా అమెరికా విమానాలు పాక్‌ నుంచి ఇరాన్‌ లక్ష్యాలు చేసాయని ఇరాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

షియా సమాజం ఆగ్రహం..
ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న షియా ముస్లింలు పాక్‌ పాలకులపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అమెరికా తీరుపై నిరసన తెలుపుతున్నారు. ఇజ్రాయెల్‌ దాడులను తప్పు పడుతున్నారు. నిరసనలకు పాకిస్తాన్‌లోని షియా సమాజం మద్దతు తెలుపుతోంది. కరాచీలోని అమెరికా రాయబారి కార్యాలయంపై నిరసనకారులు దాడి కూడా చేశారు? మరోవైపు తెహ్రీక్‌ లబ్బైక్‌ పాకిస్తాన్‌ పాలస్తీనాకు ద్రోహం చేయవద్దని హెచ్చరించింది. ఇది పాక్‌ ప్రభుత్వంపై అంతర్గత ఒత్తిడి పెంచుతోంది.

ఇరాన్‌ ప్రతీకార చర్యలు గ్వాదర్‌ పోర్టు, పాక్‌–ఇరాన్‌ సరిహద్దులపై దృష్టి పెట్టవచ్చు. సున్నీ–షియా విభేదాలు మరింత పెరిగి అంతర్గత అశాంతి తీవ్రమవుతుంది. అమెరికా మద్దతు ఆరోపణలు పాక్‌ విదేశాంగ సంబంధాలను దెబ్బతీస్తాయి. దీంతో పాకిస్తాన్‌ ఇప్పటికే తనకున్న సమస్యలకు తోడు కొత్తగా రెండు సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగో సమస్య ఇరాన్‌ ఆగ్రహం, ఐదో సమస్యగా పాకిస్తాన్‌లోని షియా జనాబాలో రాజుకుంటున్న అసంతృత్తి. ఇవి పాకిస్తాన్‌కు మరింత ఇబ్బందిగా మారనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version