Lakshmi Pranathi: ఎన్టీఆర్ 2011లో లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. లక్ష్మి ప్రణతి బంధువుల అమ్మాయి అని సమాచారం. పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. పెద్దబ్బాయి పేరు అభిరామ్, రెండో బాబు పేరు భార్గవ్ రామ్. కాగా లక్ష్మి ప్రణతి గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె బయట చాలా అరుదుగా కనిపిస్తారు. అతి సామాన్యులు కూడా సోషల్ మీడియా వాడుతున్న రోజుల్లో… ఆమె దానికి దూరంగా ఉంటున్నారు.
లక్ష్మి ప్రణతికి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. దాని వలన లక్ష్మి ప్రణతి లైఫ్ స్టైల్ ఏమిటనేది తెలియదు. చివరికి సినిమా ఈవెంట్స్ కి సైతం ఆమె హాజరుకారు. మిగతా స్టార్ హీరోల భార్యలు తమకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మైంటైన్ చేస్తున్నారు. లక్ష్మి ప్రణతి అది కోరుకోవడం లేదు. కాగా అసలు లక్ష్మి ప్రణతి ఎలాంటి వారు? ఆమె వ్యక్తిత్వం ఏమిటో? తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందిలో ఉంది.
నిజ జీవితంలో లక్ష్మి ప్రణతి ఎలా ఉంటారో ఆమె తమ్ముడు నార్నె నితిన్ చెప్పుకొచ్చాడు. నార్నె నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆయన మ్యాడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆయన లేటెస్ట్ మూవీ ఆయ్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఆయ్ చిత్ర ప్రమోషన్స్ లో నార్నె నితిన్ పాల్గొంటున్నాడు.
ఈ సందర్భంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నార్నె నితిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బావ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సలహాలు ఇస్తారని అడగ్గా… ప్రత్యేకంగా కాకపోయినా కలిసినప్పుడు టాపిక్ వస్తుంది. ఆయన ఎక్కడి ఇలా చేయాలి, అక్కడ అలా చేయాలని సూచనలు ఇస్తారని నార్నె నితిన్ అన్నాడు. మీ సిస్టర్ లక్ష్మి ప్రణతి మీడియా ముందుకు రారు. ఆమె గురించి ప్రేక్షకులు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఆమె ఎలా ఉంటారు? మీ ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుంది? అని యాంకర్ మరొక ప్రశ్న అడిగింది.
ఒక అక్క తమ్ముడు మధ్య ఉండే క్రేజీ బాండింగ్ మా మధ్య కూడా ఉంది. అక్క చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఆమె పెద్దగా మాట్లాడరు. ఎవరినీ కలవరు… అని నార్నె నితిన్ లక్ష్మి ప్రణతి గురించి వెల్లడించారు. నార్నె నితిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా గతంతో పోల్చితే లక్ష్మి ప్రణతి ఈ మధ్య కాలంలో బయట కనిపిస్తున్నారు. భర్తతో పాటు అమెరికా వెళ్లిన లక్ష్మి ప్రణతి ఫోటోలు వైరల్ అయ్యాయి. అమెరికా ట్రిప్ లో ఆమె మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించడం విశేషం. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ 31 లాంచింగ్ ఈవెంట్ కి తన ఇద్దరు కుమారులతో పాటు లక్ష్మి ప్రణతి హాజరైంది. చిత్ర యూనిట్ తో పాటు ఫోటోలు దిగింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కుటుంబాలు ఒకటి రెండు సందర్భాల్లో కలిశారు. ప్రశాంత్ నీల్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఎన్టీఆర్ ఇంటికి ఖచ్చితంగా వస్తారు.