Horoscope Today in Telugu
‘Today horoscope in Telugu ‘: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శుక్రుడు మీన రాశిలో ప్రయాణించడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండానే ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ప్రణాళికలు రచిస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఈ రాశి వారి అభివృద్ధికి కొందరు ఆటంకాల సృష్టించవచ్చు. పెద్దల సలహా తీసుకొని కొత్త పెట్టుబడులు పెట్టాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఇప్పుడు పెట్టుబడులు పెట్టినట్లయితే భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దూరంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో గొడవలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వాదనకు దిగాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాయంత్రం ఇంటికి చుట్టాలు రావడంత సందడిగా ఉంటుంది. పాత స్నేహితులన కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులుచేసే పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : చట్టపరమైన చిక్కులు ఉంటే తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహా రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉండనుంది. తండ్రి సహాయంలో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. మాటల మాధుర్యంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. సాయంత్రం ధన లాభం ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యుల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని నిరాశకరమైన వార్తలు వింటారు. సోదరులతో వ్యాపారం చేయాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం. అందువల్ల కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఆస్తి విషయంలో శుభవార్త వింటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు మార్పులు చేయాల్సి వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. సీనియర్లతో వాగ్వాదం చేయొద్దు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కుటుంబంతో సరదాగా గడుపుతారు. అనుకోకుండా డబ్బు రావొచ్చు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. అయితే వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టబుబడులు పెడుతారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుబ సభ్యులతో సరదాగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) :ఈ రాశివారు ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల్లో ఒకరి నుంచి ధన సాయం పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.