https://oktelugu.com/

Deputy CM Pawan Kalyan : అపోలో హాస్పిటల్స్ లో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..కీలక పరీక్షలు చేసిన వైద్యులు..ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!

మంగళగిరి నుండి హైదరాబాద్ కి మొన్న రాత్రి పయనమైన పవన్ కళ్యాణ్, ఈమేరకు పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ తో పాటు పలు కీలకమైన పరీక్షలు నిర్వహించిన వైద్యులు, పవన్ కళ్యాణ్ కి ముఖ్యమైన సూచనలు చేసారు. ఈ నెల చివర్లో కానీ, లేదా మార్చి మొదటి వారంలో కానీ ఆయన మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారట.

Written By: , Updated On : February 23, 2025 / 08:19 AM IST
Pawan Kalyan admitted to Apollo Hospitals

Pawan Kalyan admitted to Apollo Hospitals

Follow us on

Deputy CM Pawan Kalyan :  జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైరల్ ఫీవర్ తో పాటు వెన్ను నొప్పి సమస్యతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వైరల్ ఫీవర్ పూర్తిగా తగ్గినప్పటికీ, వెన్ను నొప్పి ఆయన్ని ఇప్పటికే బాధిస్తూనే ఉంది. అందుకే నిన్న ఆయన అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి పలు వైద్య పరీక్షలు చేసుకున్నట్టు జనసేన పార్టీ(Janasena Party) సోషల్ మీడియా అధికారికంగా ప్రకటించింది. మంగళగిరి నుండి హైదరాబాద్ కి మొన్న రాత్రి పయనమైన పవన్ కళ్యాణ్, ఈమేరకు పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ తో పాటు పలు కీలకమైన పరీక్షలు నిర్వహించిన వైద్యులు, పవన్ కళ్యాణ్ కి ముఖ్యమైన సూచనలు చేసారు. ఈ నెల చివర్లో కానీ, లేదా మార్చి మొదటి వారంలో కానీ ఆయన మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారట.

ఇది ఇలా ఉండగా ఈ నెల 24వ తారీఖు నుండి ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడని జనసేన సోషల్ మీడియా వెల్లడించింది. గంటల తరబడి అసెంబ్లీ లో కూర్చోవాల్సి వచ్చే అవకాశం ఉన్నందున, వైద్యుల సూచనల ప్రకారం వెళ్లేందుకే ఆయన అపోలో హాస్పిటల్స్ లో ఈ కీలక పరీక్షలు చేయించుకున్నాడని టాక్. ఆయన హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ఫోటోలు జనసేన సోషల్ మీడియా విడుదల చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. తమ ఆరాధ్య దైవాన్ని ఇలా చూడలేకపోతున్నాము అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కన్నీటి పర్యంతమై కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం 5 గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశానికి జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు.

ఈ సమావేశం లో బడ్జెట్ సెషన్స్ లో మాట్లాడాల్సిన కీలక పాయింట్స్ ని చర్చించుకోబోతున్నారట. జనసేన ఖాతాలో సివిల్ సప్లైస్, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలు ఉన్నాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ శాఖలకు సంబంధించిన సమీక్షలు కూడా నిర్వహించబోతున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే నెల 28వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేవరకు డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవట. మార్చి 28 న విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు.