New Film Releases: తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా చాలా దెబ్బతిన్నది. 2020 ప్రారంభంలో పెద్దగా సినిమాలు రాకపోవడం, మార్చిలో దేశంలోకి కరోనా ఎంట్రీ.. ఆ తర్వాత ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించడం.. కేసులు పెరుగుతున్న దృష్ట్యా సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. 2020 మార్చి నుంచి 2021 సెప్టెంబర్ వరకు చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని చవిచూసింది. షూటింగులు ఆగిపోవడంతో సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లు ఓపెనింగ్‌కు, షూటింగులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా సెప్టెంబర్ నుంచి ఆక్టోబర్ మధ్య థియేటర్లు తెరచుకున్నాయి.
కొత్త సినిమాలు లేకపోవడం, బడా హీరోల సినిమాలు వరుసగా వాయిదా పడుతూ వస్తుండటమే అందుకు కారణంగా థియేటర్ల అసోసియేషన్ పేర్కొంది. అయితే, కొవిడ్ టైంలో కొన్నిసినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ హాట్‌స్టార్ పలు సినిమాలు విడులవ్వగా అందులో కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని ప్లావ్ అయ్యాయి. టక్ జగదీష్, ఉప్పెన, నారప్ప, దృశ్యం-2, జైభీమ్, కలర్ ఫోటో, అరణ్య వంటి సినిమాలు ఓటీటీలోనే విడులైన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో చాలా వరకు వెబ్ సిరీస్‌లు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.
Also Read: బన్నీకి చిత్తూరు యాస నేర్పిన ఈ చిన్నోడి కథ మీకు తెలుసా?
ఆక్టోబర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోల సినిమాలు థియేటర్ల ముందుకు వచ్చాయి. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బాలకృష్ణ అఖండ, తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప, నాని నటించిన శ్యాం సింగరాయ్ వంటి సినిమాలు విడుదయ్యాయి. వీటితో పాటే పలు చిన్న సినిమాలు కూడా థియేటర్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో విదలయ్యాయి. వీటిలో అఖండ, పుష్ప, శ్యాంసింగరాయ్ వంటి సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.
ఇక ఈ ఏడాది చివరి తేది డిసెంబర్ 31న ఏకంగా ఏడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలుగా తెలిసింది. 31వ తేదిన విడుదలవుతున్న వాటిలో రైజింగ్ హీరో శ్రీ విష్ణు నటించిన ‘అర్జున ఫల్గుణ’ ఉంది. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ.. దీంతో పాటు హీరో రానా నటించిన 1945 సినిమా కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలకు సిద్దమైంది. అలాగే తమిళ సూపర్ హిట్ సిక్వల్ మూవీ అరణ్మయి-3ని తెలుగులో అంతపురంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీటితో పాటు విక్రం, డిటెక్టివ్ సత్యభామ, టెన్ కమండమెంట్స్ వంటి సినిమాలు న్యూ ఇయర్ వేడుకకు ముందే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: These are the last day release movies of this year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com