spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ విమర్శలకు జనసేన స్ట్రాంగ్ కౌంటర్!

జగన్ విమర్శలకు జనసేన స్ట్రాంగ్ కౌంటర్!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది.

 

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్బంగా విజయవాడలో జాతీయ విద్య, మైనార్టీ దినో్త్సవం సభలో జగన్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా. ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో ఐదుగురో పిల్లలు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని ప్రశ్నించారు. అయితే, జగన్ వ్యాఖ్యలకు జనసేన సోషల్ మీడియా టీం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల అంట నిజమా వైఎస్ జగన్ ?’ అని జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని జనసేన అధికారిక ఖాతాలో రీ ట్వీట్ చేశారు.

 

అలాగే “దిగజారి పోతోన్న భాషాభిమానం” అంటూ సాక్షి పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ను పోస్ట్ చేస్తూ మరో ఘాటు విమర్శ చేసింది జనసేన.

 

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని జగన్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి.. మెల్లమెల్లగా పదో తరగతి వరకు పెంచాలని భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో తెలుగు భాషను లేకుండా చేస్తున్నారంటూ అన్ని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే, ఈ వ్యాఖ్యలకు స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper