Pawan Kalyan And Balakrishna Movie Rumors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలను రాస్తూ వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. మరి ఇప్పటివరకు వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ తమదైన రీతిలో సత్తా చాటుకున్నావే కావడం విశేషం… ఇక పాన్ ఇండియాలో స్టార్ హీరోలందరూ ఎవరికి వారు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి స్టార్ హీరో ఇమేజ్ వచ్చిందంటే చాలు వాళ్ళని ఇండస్ట్రీ లో ఆపేవారు ఎవరు ఉండరు. నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం గొప్ప సినిమాలను చేయడానికి తీవ్రమైన ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు విజయాలతో సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ ఒక ఫీట్ అయితే సాధించాడు. ఈ ఏజ్ లో కూడా ఆయన గొప్ప సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే బాలయ్య చేస్తున్న సినిమాలన్నీ కూడా అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. కాబట్టి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య బాబు (Balayya Babu) – పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
Also Read: Christmas Movies: క్రిస్మస్ కు విడుదలై హిట్ కొట్టిన సినిమాలు ఇవే
ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. అయితే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఇప్పటి నుంచే లేదు. ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని ‘దాసరి నారాయణరావు’ (Dasari Narayana) ఒక మంచి కథను కూడా రెడీ చేసుకున్నారట.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు దొరికితే మాత్రం ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…