Pawan Kalyan Mother Health Update: నేడు ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంటికి వెళ్ళాడు. సీఎం చంద్రబాబు ఆద్వర్యం లో కేబినెట్ సమావేశం లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడంతో సమావేశం మధ్యలోనే హుటాహుటిన బయలుదేరాడని, అలా వెళ్ళడానికి కారణం ఆయన తల్లి అంజనా దేవి గారి ఆరోగ్యం అస్వస్థతకు గురి కావడం వల్లనే అని మీడియా లో ఒక ప్రచారం హల్చల్ చేసింది. అభిమానులు ఒక్కసారిగా కంగారుకి గురయ్యారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలను సంప్రదించగా , అది పూర్తిగా అవాస్తవం అని తేలింది. కాసేపటి క్రితమే నాగబాబు కూడా ఈ విషయం పై స్పందించి అమ్మ చాలా ఆరోగ్యం గా ఉంది, అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ ఒక ట్వీట్ వేసాడు.
అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు హైదరాబాద్ కి అకస్మాత్తుగా వచ్చాడు?, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని కూడా అడుగుతున్నారు. దీనిపై కూడా ఆరాలు తియ్యగా, పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం మొత్తం పాల్గొన్నాడని, సమావేశం పూర్తి అయినా తర్వాతనే హైదరాబాద్ కి వెళ్లాడని, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలీదంటూ చెప్పుకొస్తున్నారు. చాలా కాలం తర్వాత అన్నయ్య ని చూడలని వెళ్లి ఉండొచ్చేమో. కుటుంబం తో కాసేపు సరదాగా గడపాలని అనుకున్నాడేమో అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే స్వల్పంగా అంజనా దేవి అనారోగ్యానికి గురైందని,అది బయటకు చెప్తే అభిమానులు కంగారు పడుతారని ఇలా కవర్ చేస్తూ ఉండుండొచ్చు అని, నిజంగా ఆయన తన తల్లిని చూసేందుకే అక్కడికి వెళ్లాడని అంటున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే క్లుప్తం గా మెగాస్టార్ చిరంజీవి స్పందించాల్సిందే. ఆయన ట్వీట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
గత కొద్దిరోజుల నుండి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మూవీ లిప్ పాల్గొంటున్నాడు. ఇప్పుడు కూడా షూటింగ్ కోసమే వెళ్లాడని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu) చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని వచ్చే నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో పక్క సెప్టెంబర్ నెలలో ఆయన హీరోగా నటించిన ఓజీ(They Call Him OG) అనే మరో చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఇలా ఆరు నెలల గ్యాప్ లో మూడు పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.