Pawan Kalyan and Annamalai : మధురై మురుగన్ భక్తుల మహానాడు అద్భుతంగా జరిగింది. 5 లక్షల మంది సభకు హాజరయ్యారు. బయట కూడా భారీ క్యూ నిలిచింది. డీఎంకే అధికారంలోకి వచ్చాక హిందూ సమావేశం ఇటువంటిది తమిళనాడులో జరగలేదు.
హిందూ భక్తుల సమావేశం అనేది తమిళనాడులో నిన్న జరిగినట్టుగా జరగలేదు. ప్రభుత్వం, వామపక్షవాదులు, ఇస్లామిక్ వాదులు ఎంతో అభ్యంతరం పెట్టి కుట్రలు చేసినా.. ఎవరి సాయం లేకుండా.. పోలీసులు పట్టించుకోకుండా ఎటువంటి గొడవలు, కొట్లాటలు లేకుండా లక్షలాది మంది హిందూ భక్తులను ఒకచోట చేర్చి ఒక మహాసభను నిర్వహించారు.
ఇందులో ప్రధాన వక్తగా పవన్ కళ్యాణ్, సహవక్తగా అన్నామలై.. వీరిద్దరి జోడి స్టేజీ మీద ఉంటే కిందనున్న లక్షలాది మందికి ఉత్తేజితం కలిగించారు. పూనకాలే వచ్చాయి. అన్నామలై ప్రసంగానికి వచ్చినప్పుడు ఆ యువకుల కోలాహలం మరిచిపోలేనిది. అన్నామలై ఇలా ఇన్ స్పైర్ చేస్తే.. పవన్ కు గౌరవం, గుర్తింపు ఎంతో మరువలేనిది.
మదురై మురుగన్ భక్తుల సమావేశంలో పవన్ కళ్యాణ్, అన్నామలైల జోడితో పూనకాలే వచ్చాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.