Homeఎంటర్టైన్మెంట్Rana Daggubati rejected movies: రానా ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా..?...

Rana Daggubati rejected movies: రానా ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా..? అవి చేసి ఉంటే స్టార్ హీరో అయ్యేవాడా..?

Rana Daggubati rejected movies: దగ్గబాటి ఫ్యామిలీ అనగానే మనకు డాక్టర్ డి రామానాయుడు గుర్తుకువస్తాడు. ఒకప్పుడు ఆయన టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వెంకటేష్ స్టార్ హీరోగా మారడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం తన వైపు తిప్పుకున్నాడు. ఇక అలాంటి వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి సురేష్ బాబు కొడుకు అయిన రానా ఇండస్ట్రీకి రావడం విశేషం… లీడర్ సినిమాతో తన కెరియర్ ను […]

Rana Daggubati rejected movies: దగ్గబాటి ఫ్యామిలీ అనగానే మనకు డాక్టర్ డి రామానాయుడు గుర్తుకువస్తాడు. ఒకప్పుడు ఆయన టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వెంకటేష్ స్టార్ హీరోగా మారడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం తన వైపు తిప్పుకున్నాడు. ఇక అలాంటి వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి సురేష్ బాబు కొడుకు అయిన రానా ఇండస్ట్రీకి రావడం విశేషం… లీడర్ సినిమాతో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన రానా ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి పాత్ర పోషించాడో అప్పటినుంచి ఆయన దశ తిరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికి ఆయన డిఫరెంట్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. స్టార్ హీరోగా మాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఒక రెండు సినిమాలు అతనితో చేయడానికి ప్రయత్నం చేశారట.

కానీ రాణా మాత్రం దానికి ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాలు కార్యరూపం దాల్చలేదు… అవి ఏంటి అంటే దేవకట్ట డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. ఇక దేవకట్ట సైతం ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారట.ఈ రెండు సినిమాలు పడుంటే రానా కెరియర్ మారిపోయేదని చాలామంది చెబుతుంటారు.

ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమా సైతం మొదట రానా తోనే చేయాలని అనుకున్నారట. కానీ మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రావడంతో అతనితో సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించారు. ఇలా ఈ రెండు సినిమాలు ఆయన చేసి ఉంటే మాత్రం ఆయన కెరియర్ మారిపోయేదని ఇప్పుడున్న స్టార్ హీరోలతో పాటు పోటీ పడుతూ నటించేవాడని చాలామంది చెబుతూ ఉండడం విశేషం…

ఇక రానా సైతం రొటీన్ సినిమాలను కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కారణమేమిటి అంటే మనం చేసే రొటీన్ రొట్టా సినిమాలతో ప్రేక్షకులు విసిగిపోయారని ఏదైనా కొత్తగా చూపిస్తేనే జనం మనల్ని గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper