Assam : అస్సాం.. ఈశాన్య భారతంలో అత్యంత ప్రధాన రాష్ట్రం.. ఒకనాడు త్రిపుర, మణిపూర్ తప్పితే మిగతావన్నీ దానికిందనే ఉండేవి. అస్సాం ఎప్పుడూ ఆర్థిక ప్రగతికి నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం అస్సాం మిగతా రాష్ట్రాలతో పోటీపడుతోంది. తాజాగా అస్సాం పెట్టుబడుల సదస్సులో ‘5 లక్షల కోట్ల’ ఎంవోయూలు జరిగాయి. ఇది ఈశాన్య భరతంలో పెద్ద రికార్డ్ గా చెప్పొచ్చు.
అస్సాంలో 91వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. ఇంకో 55 వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులు ప్రకటించారు. టాటా అస్సాంలో 3 లక్షల కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమను పెడుతున్నారు. ముఖేష్ అంబానీ, అదానీ అంబానీలు సైతం 50వేల కోట్ల పెట్టుబడులకు ఒక్కొక్కరు ఎంవోయూలు చేశారు.
జపాన్, జర్మనీ, అమెరికాలోని సంస్థలు అస్సాంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. 62 విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి. అస్సాం ఒకప్పుడు కేంద్రం నిధులపైనే ఆధారపడేది. కానీ ఇప్పుడు అస్సాం సొంత నిధులు, ఆర్థిక వనరులను సృష్టించుకుంటోంది. అస్సాం అభివృద్ధి చెందితే.. ఈశాన్య భారతం మొత్తం డెవలప్ అవుతుంది.
దేశ ఆర్థిక ప్రగతితో పోటీ పడుతున్న అస్సాం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.