Dragon Collection : ఈ మధ్యకాలంలో చిన్న హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. సరిగ్గా జనాలకు పేరు తెలియని హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కంటెంట్ తో దిగినప్పుడు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. సోషల్ మీడియా ని ఉపయోగించేవాళ్లకు ఈ సినిమా హీరో పేరు తెలిసి ఉండొచ్చు కానీ, బయట జనాలకు మాత్రం ఇతను పేరేంటో కూడా తెలియదు. అలాంటి హీరో సినిమాకి మన తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తమిళనాడు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : 10 రోజుల్లో 15 లక్షల టికెట్లు..తమిళ స్టార్ హీరోలకు కొత్త బెంచ్ మార్క్ ఏర్పాటు చేసిన ‘డ్రాగన్’ చిత్రం!
ఇప్పటి వరకు ఆ చిత్రానికి రెండు వారాలకు కలిపి 66 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుంది. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా తమిళనాడు ప్రాంతం నుండి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఫుల్ రన్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. ఇటీవల కాలం లో తమిళంలో ఈ స్థాయి లాంగ్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకున్న సినిమా లేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. #RRR , పుష్ప 2(Pushpa 2) వంటి చిత్రాలు కూడా ఆ ప్రాంతంలో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టలేదు. అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR), రాజమౌళి(SS Rajamouli) ఇలా వీళ్ళందరికీ పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్, గుర్తింపు ఉంది. అలాంటోళ్ళ సూపర్ హిట్ సినిమాలకు కూడా రానటువంటి వసూళ్లు, కొత్త వాడైన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కి రావడం నిజంగా విశేషమే.
ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం ‘లవ్ టుడే’ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆయన రెండవ సినిమాకి కూడా అదే రేంజ్ వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కేవలం వంద కోట్ల గ్రాస్ తో ఈ సినిమా సరిపెట్టేలా అనిపించడం లేదు, ఫుల్ రన్ పూర్తి అయ్యే సరికి కచ్చితంగా 170 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు. కేవలం ఓవర్సీస్ ప్రాంతం నుండే ఈ సినిమాకి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న స్టార్ హీరోల కొడుకులు ఇప్పటికీ వంద కోట్ల గ్రాస్ ని కొట్టలేక ఇబ్బంది పడుతున్న ఈరోజుల్లో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలను కొట్టడం అనేది సాధారణమైన విషయం. ప్రదీప్ రంగనాథన్ రాబోయే రోజుల్లో తమిళనాడు యూత్ ఐకాన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : నా భర్త అలాంటి వాడు’ అంటూ సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!