Justin Trudeau:అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఓహ్ కెనడా అంటూ.. ఓ ఫోటోను తన సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. అమెరికా చిత్రపటంలో కెనడాను జోడించి.. తనదైన వ్యాఖ్యానాన్ని చేశారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే ట్రంప్ ఆ ఫోటో పోస్ట్ చేయడం వెనక అసలు ఉద్దేశం ఇదేనని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే కెనడాపై టారిఫ్ లు విధిస్తూ ఇటీవల ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్త రాజకీయంగా దుమారం లేపినప్పటికీ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఈ క్రమంలో మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్ బామ్, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తో ట్రంప్ సమావేశమయ్యారు. సుదీర్ఘ సమయం అమెరికా – మెక్సికో – కెనడా ఒప్పందాల పై చర్చించారు. అయితే ఇక్కడ కీలకమైన అంశాలను కెనడా ప్రధానమంత్రి, మెక్సికో అధ్యక్షురాలు లేవనెత్తడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. సుంకాల విధింపు పై ఒక నెలపాటు సమయం ఇస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత టారిఫ్ లు యధావిధిగా అమలు అవుతాయని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మెక్సికో అధ్యక్షురాలు స్వాగతించారు. దీనివల్ల ప్రాంతీయ ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతాయని.. మెక్సికో ఎగుమతిదారులు ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ మార్చుకోవడానికి ఇది సహకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డు లుట్నిక్ స్వాగతించారు. నెలపాటు టారిఫ్ లు విధించకుండా ఇచ్చిన వెసల బాటు భవిష్యత్తు కాలంలో అమెరికా – కెనడా ఆ మెక్సికో ఒప్పందాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఒప్పందం పరిధిలో వ్యాపారం చేసే వారికి టారిఫ్ ల మినహాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం బయట ఉండే వారు మాత్రం సుంకాలు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
Also Read : భారత్‌పై ట్రంప్ ప్రతీకారం.. భారీగా సుంకాలు విధించేందుకు ప్రణాళిక.. ఏప్రిల్ 2 నుంచి అమలు చేసే అవకాశం!
కన్నీటి పర్యంతమైన ట్రూడో
ట్రంప్ టారిఫ్ లు విధించిన నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. మరికొద్ది రోజుల్లో ఆయన తన పదవి నుంచి వైదొలిగి పోతారు. ఈ సమయంలో ఆయన కన్నీటి పర్యంతం కావడం ఒకసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది..” నాకు కెనడా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. నా పదవి చివరి రోజుల్లో కూడా ప్రజలను దూరంగా పెట్టలేదు. వచ్చే కాలంలో కెనడా ప్రజలను వదిలిపెట్టేది లేదని” టుడే వ్యాఖ్యానించాడు. టారిఫ్ లపై ట్రంప్ ఒక నెలపాటు ఊరట ఇచ్చిన నేపథ్యంలో ట్రూ డో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న సంక్షోభాలు.. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడటం వంటివి కష్టకాల సమయాలు. కెనడా ప్రజలకు సేవ చేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను. ట్రంప్ విధించిన టారిఫ్ లు అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి. కాకపోతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటప్పుడు కెనడా ప్రజలు సంఘటితంగా ఉండాలి. ఆర్థిక శక్తిని బలోపేతం చేసుకోవాలి. కెనడాను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించుకునేలాగా కష్టపడాలని” ట్రూడో వ్యాఖ్యానించాడు. మరోవైపు ఖలిస్థా ని వేర్పాటు వాదులకు ట్రూడో ఆశ్రయం ఇచ్చారని ఆ మధ్య ఆరోపణలు వినిపించాయి. కెనడాలో జరిగిన పరిణామాలకు భారత్ కారణమని ట్రూడో ఆ మధ్య ఆరోపించడం సంచలనానికి కారణమైంది. అయితే ఇప్పుడు పదవి నుంచి దిగిపోవడానికి దగ్గరగా ఉన్న సమయంలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం.. కన్నీటి పర్యంతం కావడం విశేషం.
Also Read :అమెరికాపై ప్రతీకారం.. అగ్రరాజ్యం ఉత్పత్తులపై సుంకాలు!
BROKEN BY TRUMP! Canadian PM Justin Trudeau seen sobbing in front of the cameras amid Trump’s tariff policies.
“On a personal level – I’ve made sure every single day in this office, I’ve put Canadians first… I am here to tell you all that we got you. Even in the very last… pic.twitter.com/XeFyxApk1r
— Eric Daugherty (@EricLDaugh) March 6, 2025