Amith shaw – Chandrababu : చంద్రబాబు, అమిత్ షా భేటి ఏమై ఉంటుంది.? ఎందుకు ఇన్ని సందేహాలు వస్తున్నాయి. దీని వెనుక అసలు కారణాలు ఏమిటీ? గత మూడు నాలుగు రోజుల నుంచి మీడియాలో ఇదే చర్చ. ఎవరికి తగ్గ ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. ఒకటి రామోజీరావు కోసం చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలిశారని.. రెండోది పొత్తుల కోసం అమిత్ షాను కలిశాడన్నది వాదన. అటు బీజేపీ వర్గాలు కానీ.. ఇటు తెలుగుదేశం వర్గాలు కానీ అధికారికంగా స్పందించలేదు. ఇదే ఊహాగానాలకు తావిస్తోంది.
ముందుగా చంద్రబాబు నాయుడు రామోజీరావు కోసం అమిత్ షాను కలిశాడా? అంటే అవుననే అనిపిస్తోంది. రామోజీరావు ఇంత ఆత్మరక్షణలో ఎప్పుడూ పడలేదు. వైఎస్ఆర్ టైంలో కూడా రామోజీపై దాడి జరగలేదు. జగన్ మాత్రం రామోజీ ఆర్థికమూలాలు దెబ్బతీయాలని కేసులు, విచారణ చేస్తున్నారు.
ఏదో ఒక విధంగా ఈ కేసులోంచి బయటపడాలన్న తపన తాపత్రయం పెరిగిపోయింది. అందుకే రామోజీరావు తరుఫున లాబీయింగ్ చేసే పెద్దమనిషి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమిత్ షాపై చంద్రబాబు ఒత్తిడితోపాటు రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉంాయని తెలుస్తోంది.
చంద్రబాబు అమిత్ షాను కలిసింది పొత్తుల కోసమా లేక రామోజీరావు కోసమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..