TRS Dissident Leaders: పేరుకు ప్రజాస్వామ్యం అంటుంటాం కానీ.. మన పాలక ప్రభుత్వాలు అనుసరించేవన్నీ రాచరికపు పోకడలే. ఇప్పటికి నిన్న కాకతీయ సప్తాహం పేరుతో బస్తర్ లో స్థిరపడిన భంజ్ దేవ్ వ్యవహార శైలి చూశాం కదా! అతనికి సంబంధం లేకున్నా ఒక బీజేపీ నాయకుడికి టీఆర్ఎస్ నాయకత్వం సాగిల పడిన తీరును కన్నాం కదా! అధికారం అల్టిమేట్ అయినప్పుడు విధానాలు, విశ్వాసాలు ఎప్పుడూ పరిగణలోకి రావు. గొప్ప గొప్ప నాయకులు పార్టీలను స్థాపించవచ్చును గాక.. అవన్నీ కుర్చీ ఎక్కకముందే.. వన్స్ పీఠం ఎక్కారా అవన్నీ గాయబ్. దేశంలో పార్టీలన్నీ ఫ్యామిలీ ప్యాకేజీ లాంటివే. కొండోకొచో ఉండవచ్చును గానీ.. మిగతావన్నీ అదే బాపతు. ఈ సువిశాల భారత దేశంలో జాతీయ పార్టీలు అయితే తల్లిదండ్రులు లేదా వారి పిల్లలది అధికారం ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీలపై కుటుంబం మొత్తం అధికారం చెలాయిస్తుంది. కుటుంబ పార్టీలో లుకలుకలు మొదలైతే అసలుకే మోసం వస్తుంది. 20 ఏళ్ల క్రితం జరిగిన నేపాల్ రాజకుటుంబంలో జరిగిన ఘటన నుంచి నిన్నటి మహారాష్ట్ర వరకు చెబుతున్న పాఠాలు ఎన్నో. అధికారం కోసం ఎంతటి పన్నాగానికైనా తెగబడుతున్న తీరు, అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్నాయి.

ఎవరు తక్కువ
బీహార్ పరిణామం చూశాం కదా! చాన్నాళ్ల తర్వాత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకుంది. తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాడు! కానీ ఏం జరిగింది? ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. తేజస్వీ యాదవ్ చిట్టా నితీష్ కుమార్ దగ్గర ఉంది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఉద్దవ్ పదవీ నుంచి బయటకు వెళ్లిన తీరు చదివాం కదా! బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ నేడు కొడుకు అసమర్ధత్వం వల్ల అత్యంత దయనీయస్థితిలోకి వెళ్ళింది. “పుత్రాదిత్యం పరాజయం” అంటే ఓటమి కొడుకు చేతిలో అందంగా ఉంటుందని.. కానీ తండ్రులు పొందిన ఓటమి చాలా దారుణంగా ఉంది. కర్ణాటకలో దేవే గౌడ కుమారుడు కుమార స్వామి ద్వారా, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తన మొదటి కుమారుడు అలగిరి ద్వారా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన కొడుకు ఆదిత్య ఠాక్రే ద్వారా పొందిన ఓటములు అన్ని ఇన్ని కావు. ఇవి వారి రాజకీయ జీవితాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ప్రభావితం చేశాయి. ఇన్ని ఘటనల్లో మనకు స్థూలంగా కనిపించే అంశం ఒక్కటే ఒకటి.. “ఇంటిగుట్టు లంకకు చేటు”
Also Read: Union Cabinet: కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు మరో బెర్తు.. రేసులో లక్ష్మణ్, బండి
కట్టప్పల వల్లే
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో కత్తులు దూసుకుంటున్నాయి. ఢిల్లీ కోతలు బద్దలు కొడతామని కేసీఆర్, మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. కానీ ఇప్పట్లో బిజెపి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. గతంలో టిడిపి, తృణమూల్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు బిజెపికి ఏమీ కాలేదు. కానీ కేసీఆర్ మాత్రం పదే పదే ఢిల్లీ బద్దలు కొడతామని చెప్తున్నారు. ఇది సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార టీఆర్ఎస్ లో కట్టప్పలు చాలామంది ఉన్నారని, వారే ప్రభుత్వాన్ని పడగొడతారని బిజెపి నేతలు అంటున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీకి సుప్రీం గా కేసీఆర్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని కేటీఆర్ ద్వారా భర్తీ చేశారు. పార్టీలో ముసలం పుట్టే అవకాశాలు లేవు. ఈటెల రాజేందర్ ద్వారా “పార్టీ ఓనర్లం” మేమే అనే వ్యాఖ్యలు వినిపించినా అవి ఆదిలోనే కనుమరుగైపోయాయి. ఇప్పట్లో టిఆర్ఎస్ లో ఆ స్థాయిలో ప్రకంపనులు వినిపించే అవకాశం లేనట్టు కనిపిస్తున్నా.. ఎక్కడో ఒకచోట మాత్రం లూప్ హోల్ కనిపిస్తూనే ఉంది.

సంతోష్ రావు భార్యను రావద్దన్నారు
ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ అధికార ఛానల్. ఈ ఛానల్ ప్రారంభించిన మొదటి నుంచి ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు భార్య ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. అయితే ఇటీవల సంతోష్ రావు తన స్థాయిలో ఎదుగుతూ ఉండటం, ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు తీయాలో, ఎప్పుడు మూయాలో, కేసీఆర్ ని ఎవరు కలవాలో, ఎప్పుడు కలవాలో నిర్ణయించే స్థాయిలో ఉన్నాడు. దీంతో అతడితో నాకు ఎప్పటికైనా త్రెట్ ఉంటుందని భావించిన కేటీఆర్.. టీ న్యూస్ లో సంతోష్ రావు భార్యను తొలగించారు. ఇక సంతోష రావు ఆదేశాలు పాటించవద్దని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో హరీష్ రావు ని బిజెపి నాయకులు కలిసినట్టు వార్తలు రావడంతో కెసిఆర్ కొద్దిరోజులు దూరం పెట్టారు. ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖను కూడా ఆయనకే కేటాయించారు. ప్రస్తుతం హరీష్ రావుకు ఊపిరి సలపనంత బిజీ ఉంది. పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్న కేటీఆర్.. మిగతా శాఖలను కూడా తన ఆధీనంలో ఉంచుకున్నారు. రకంగా చెప్పాలంటే షాడో సీఎంగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. క్రమంలోనే బిజెపి నాయకులు ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మంత్రులు తమకు టచ్ లో ఉన్నారని చెప్పారు. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ అండ్ కో వెంటనే అంతర్గత నివారణ చర్యలు చేపట్టింది. టిఆర్ఎస్ లో సంతోష్ రావు ద్వారానే ఆ ముసలం పుట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హరీష్ రావు ని కూడా ఇలాగే తొక్కేస్తే ఆయన కూడా అంతకంటే పైకి ఎదగగలడని చెబుతున్నారు. ఎంపీగా ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చిన ఇప్పటికీ ఆమె నారాజ్ గానే ఉన్నారని ప్రగతి భవన్ సమాచారం. ప్రస్తుతం టీఆర్ఎస్ లో బాహుబలి స్థాయిలో కట్టప్పలు ఉన్నప్పటికీ.. అమరేంద్ర బాహుబలి ని చంపేంత ఉద్రకానికి కొంత దూరంలో మాత్రమే ఉన్నారు అనేది సుస్పష్టం.
[…] Also Read: TRS Dissident Leaders: ‘కారు’లో కట్టప్పలు.. మరో మహార… […]
[…] Also Read: TRS Dissident Leaders: ‘కారు’లో కట్టప్పలు.. మరో మహార… […]