BJP Focus On KCR: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం, అధికార టీఆర్‌ఎస్ పార్టీ అరాచకాల గురించి ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఈమేరకు పార్టీ ఆరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డీకే.అరుణతో గంటకుపైగా రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం కేసీఆర్ అధికార దుర్వినియోగం, కుటుంబ పాలన, కొన్ని నియోజకవర్గాలకే నిధులతోపాటు, సీఎస్ సోమేశ్‌కుమార్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను కొట్టడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్‌పై ‘బదిలీ’ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పునర్విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కానీ ఆయన తర్వాత సెంట్రల్ అడ్మనిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అతడికి అత్యంత ప్రాధాన్య పదవులు, కీలక శాఖలు అప్పగించింది. చివరకు చీఫ్ సెక్రెటరీగా కేసీఆర్ నియమించారు. దీంతో సోమేశ్‌కుమార్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ వివరాలన్నీ సేకరించిన బీజేపీ నాయకత్వం అతడిని సాగనంపే ప్రక్రియ మొదలు పెట్టినట్లు సమాచారం.

2019లో ఏపీలో ఇదే వ్యూహం..
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడును ఓడించడానికి ఏ తరహా వ్యూహాలు అమలు చేశారో అదే తరహా వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలోను పునరావృతం చేయాలని బీజేపీ యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో సోమేశ్‌కుమార్ కంటే సీనియర్లు ఉన్నప్పటికీ 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆయనను ఏరికోరి చీఫ్ సెక్రెటరీగా నియమించారు. అయితే ఆయన వ్యవహారశైలిపై రాష్ట్ర బీజేపీ నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా హైకోర్టులో సీఎస్‌కు సంబంధించి జరిగిన వాదనల్లో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఆయన్ని ఏపీకి పంపించాలంటూ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేసింది. హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
Also Read: TRS Dissident Leaders: ‘కారు’లో కట్టప్పలు.. మరో మహారాష్ట్రగా తెలంగాణ అవుతుందా?

ఏపీకి వెళ్లాల్సి వస్తే..
సీఎస్ సోమేశ్‌కుమార్ ఏపీకి బదిలీ అయితే ఆయనకు అక్కడ ఇప్పుడున్న క్యాడర్‌లో పదవి దక్కదు. ఈ పరిణామం కేసీఆర్‌కు బాగా ఇబ్బందికరమని రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలయ్యేవరకు సోమేశ్ సీఎస్‌గా ఉండేలా ముందే ఆయన జాగ్రత్తపడ్డారు. అనుకోని రీతిలో ఇప్పుడు ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. రానున్న రోజుల్లో భారతీయ జనతాపార్టీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఎత్తులు వేస్తుంది? వాటిని ఎలా చిత్తుచేయాలి? అన్న విషయమే తెలంగాణ రాజకీయాలను హాట్‌హాట్‌గా ఉంచబోతున్నాయి.
Also Read:Union Cabinet: కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు మరో బెర్తు.. రేసులో లక్ష్మణ్, బండి