Bhumi Pednekar: మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్ బాలా సినిమా అంటేనే ఫీల్ గుడ్ అండ్ మెసేజ్ ఎంటర్ టైనర్. అన్నిటికీ మించి బాలా సినిమా అంటే ఒక బ్రాండ్.. పైగా ఆయనొక క్రియేటివ్ డైరెక్టర్. ఇక బాలా ప్రస్తుతం హీరో సూర్యతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూర్తి కానుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ఫేవరేట్ బబ్లీ బ్యూటీ భుమి పెడ్నేకర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోందని.. కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ నెల అనంతరం జరగబోయే షూట్ లో భుమి పెడ్నేకర్ కూడా షూట్ లో పాల్గొనబోతుందని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో భుమి పెడ్నేకర్ ద్విపాత్రాభినయం చేయనుందట. వాటిలో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజీ పాత్ర కాగా, మరో పాత్ర ఆమె తల్లి పాత్ర వాణి దేవి పాత్ర అని, సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్రలుగా ఉండే ఈ పాత్రల కోసం భుమి పెడ్నేకర్ బరువు కూడా తగ్గబోతుందని తెలుస్తోంది.
Also Read: Nityananda Swami: ఏముంది స్వామీ నీలో.. నపుంసకుడినన్నా.. నీవెంటే పడుతున్నారు!?
అయితే భుమి పెడ్నేకర్ పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవని మొత్తానికి భుమి పెడ్నేకర్రోల్ బాగా ఎగ్జైటింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. పైగా రాజీ పాత్ర వెరీ బోల్డ్ గా ఉంటుందని, ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో అందాల అరబోతలో హద్దులు దాటేలా సీన్స్ ఉండబోతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.
పైగా ఆ బోల్డ్ సన్నివేశాల్లో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేయడానికి భుమి పెడ్నేకర్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక భుమి పెడ్నేకర్ అందుకు తగ్గట్లుగానే బాడీ కూడా తగ్గిస్తుందట. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సంచలనం అనిరుద్ సంగీతం అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏమైనా బాలా చాలా సంవత్సరాలు తరువాత ఎంతో ఆసక్తిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దీనికి తోడు బాలీవుడ్ ఫేవరేట్ బబ్లీ బ్యూటీ భుమి పెడ్నేకర్ ను కూడా సౌత్ లో పరిచయం చేస్తున్నాడు. మరి ఆమెకు ఈ సినిమాతో సౌత్ లో కూడా ఫాలోయింగ్ వస్తోందేమో చూడాలి.
Also Read:Anasuya Bharadwaj: బుల్లితెరకు బైబై.. వెండితెరకే అనసూయ ప్రాధాన్యం!