Virat Kohli : టీమిండియా ఆసియాకప్ కు సిద్ధమవుతోంది. దాయాది పాకిస్తాన్ తో మ్యాచ్ ఉంది. తర్వాత నేరుగా వరల్డ్ కప్ కు రెడీ కావాలి. ఈ క్రమంలోనే టీమిండియాను వేధిస్తున్న నంబర్ 4 సమస్యకు పరిష్కారం కోసం అటు బీసీసీఐ, ఇటు టీమిండియా మాత్రమే కాదు దిగ్గజ మాజీ క్రికెటర్లు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ 4వ నంబర్ స్థానంలో ఎవరిని ఆడించాలన్న ఉత్కంఠ వీడడం లేదు.
విరాట్ కోహ్లీని నం. 4లో ఆడించాలని తాజాగా భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈ ఆలోచనకు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మద్దతు ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌కు సంబంధించి జట్టు మేనేజ్మెంట్ సరళంగా ఉండాలని సూచించాడు. ప్రత్యేకించి కొత్త బంతితో రాణించేవారి విషయంలో జాగ్రత్త అవసరం అన్నాడు.
మెన్ ఇన్ బ్లూ తరచుగా కొత్త బంతితోనే దెబ్బతింటోందని.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరియు కోహ్లిల ప్రారంభంలో వికెట్లు కోల్పోతే అది భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమవుతోందని గవాస్కర్ పేర్కొన్నాడు.
నం. 4లో కోహ్లీ 39 ODIలు ఆడాడు, 55.22 సగటుతో 1767 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ, అతని సహజ స్థానం నం. 3లోనే ఎక్కువగా హిట్ అయ్యాడు. 3వ స్థానంలోనే తన స్కోరింగ్‌లో ఎక్కువ భాగం చేశాడు. 210 ODIలలో 60.21 సగటుతో 39 సెంచరీలతో సహా 10,777 పరుగులు కోహ్లీ చేశాడు.
గవాస్కర్ మాట్లాడుతూ ‘బ్యాటింగ్ ఆర్డర్లో ఏ జట్టు అయినా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. కానీ నేను టాప్ ఆర్డర్‌కు భంగం కలిగించకూడదనుకుంటున్నాను. రోహిత్ శర్మ ఆర్డర్ డౌన్ బ్యాటింగ్ చేయాలని నేను అనుకోను. మీరు కోహ్లిని నం. 4లో ఉంచడాన్ని చూడవచ్చు, ఒక వికెట్ ముందుగానే పడితే కొత్త బంతి కొంత తొందరగా దెబ్బతింటుంది. “టీమిండియా ఓడిపోయిన ప్రతిసారీ, మొదటి 10-12 ఓవర్లలో కొత్త బంతితో భారత్ మూడు లేదా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్లలో రెండు వికెట్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లిలవే కావడం వాస్తవం. బాధితులం కాబట్టి ఇది కష్టం. బహుశా పరిస్థితిని బట్టి ఆర్డర్ మార్చుకుంటే బెటర్.”
పార్ట్టైమర్లు రోహిత్ మరియు కోహ్లి లను మించి అంతగా ఉపయోగపడరని గవాస్కర్ నొక్కి చెప్పాడు. ఆసియా కప్ , ODI ప్రపంచ కప్‌లో మెన్ ఇన్ బ్లూ విజయానికి ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చాలా కీలకం అని గవస్కార్ తెలిపారు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఛాంపియన్షిప్లను గెలుచుకున్న విజయవంతమైన జట్లను చూస్తే అందులో ఆల్ రౌండర్లదే కీలక పాత్ర. ఆల్ రౌండర్లు, బౌలింగ్ చేయగల బ్యాటర్లు మరియు బౌలర్లు ఆరు లేదా ఏడు ఓవర్లు బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు మంచి పరుగులు అందిస్తే ఆ జట్టుకు విజయం.కాబట్టి, ఆల్ రౌండర్లే కీలకం అని నేను భావిస్తున్నాను, కాబట్టి హార్దిక్ పాండ్యాను జట్టులో చూడటం మంచిది. అతను రవీంద్ర జడేజాతో పాటు గేమ్ ఛేంజర్ అయిన ఆటగాడు. ఈ ఇద్దరు కుర్రాళ్లు కీలకం కానున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Sunil gavaskar reacts ravi shastri s idea playing virat kohli no 4
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com