AUS vs IND : ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఈ సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడానికి అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం. మరో వైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ పై సీరియస్ గా దృష్టి సారించింది. అయితే అటు ఆస్ట్రేలియా, ఇటు భారత జట్లకు ఆస్ట్రేలియా వెదర్ డిపార్ట్మెంట్ సంచలన విషయం వెల్లడించింది.. దీంతో రెండు జట్లు షాక్ కు గురయ్యాయి.. బ్రిస్ బేన్ మాదిరిగానే మెల్ బోర్న్ లోనూ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ వర్షం కురిస్తే ఈ టెస్ట్ కూడా డ్రా అవుతుందని తెలుస్తోంది.
50 శాతం వర్షం కురవడానికి అవకాశం
మెల్ బోర్న్ ప్రాంతంలో వర్షం కురవడానికి 50% అవకాశం ఉందట. బుధవారం నుంచి అక్కడ తీవ్రంగా గాలులు వీస్తున్నాయి. రెండవ రోజు కూడా అక్కడ అలాంటి వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. ఇక మూడవ రోజు నుంచి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుందని.. వర్షం కురవడానికి 30 శాతం మాత్రమే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మిగతా రెండు రోజుల్లో వర్షం కురవడానికి అంతగా అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు 110 టెస్ట్ లలో తలపడ్డాయి.. అయితే ఆస్ట్రేలియా దే పై చేయిగా ఉంది. ఆస్ట్రేలియా 46 మ్యాచులలో విజయం సాధించింది. టీమిండియా 33 మ్యాచ్లలో గెలుపును సొంతం చేసుకుంది. 30 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ టై అయింది..
మైదానం ఎలా ఉందంటే
మెల్ బోర్న్ లోని మైదానం అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు ఉపకరిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో పేస్ బౌలర్లు బౌన్స్ రాబట్టొచ్చు. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్ పాతబడుతుంది. బంతి కూడా పాతబడుతుంది. అప్పుడు బ్యాటర్లు తమ షాట్ లు ఆడేందుకు అవకాశం ఉంటుంది. స్పిన్ బౌలర్లు ఇక్కడ ప్రభావం చూపించడానికి అవకాశం ఉండదు..మెల్ బోర్న్ లో 1996 నుంచి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించేందుకు డ్రాప్ ఇన్ పిచ్ లు ఉపయోగిస్తున్నారు. డిసెంబర్ 26 నుంచి 30 వరకు భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరుగుతుంది. ఆస్ట్రేలియా కాలమాన ప్రకారం గురువారం ఉదయం ఐదు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.. టాస్ నాలుగు గంటల 30 నిమిషాలకు వేస్తారు.. ఈ మ్యాచ్ ను ఇండియా టీవీ లోని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిడి స్పోర్ట్స్ (ఉచితంగా) లో చూడొచ్చు. యాప్ లో అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో వీక్షించవచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The australian weather department made the announcement ahead of the boxing day test
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com