spot_img
Homeప్రత్యేకంPawan kalyan - Sri Aurobindo : శ్రీ అరబిందో తొలి తరం స్వాతంత్రోద్యమ నాయకుడు

Pawan kalyan – Sri Aurobindo : శ్రీ అరబిందో తొలి తరం స్వాతంత్రోద్యమ నాయకుడు

Pawan kalyan – Sri Aurobindo : జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నారైల కోసం ‘సేవ్’ అనే ఆర్గనైజేషన్ పెట్టాడు. ప్రవాస భారతీయులకు సేవ చేసేందుకు దీన్ని పెట్టారు. ఇది విశ్వవేదికగా పనిచేస్తుంది. ఎందరో భారత దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు. భారతీయ మూలాలను సజీవంగా నిలుపుకుంటున్నారు. అటువంటి వారందరి కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్నదే “శ్రీ అరబిందో విశ్వ వీణ” (SRI AUR0BINDO VISWA VEENA – “SAVVE”). శ్రీ అరబిందో, మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తిగా SAVVE అని పవన్ కళ్యాణ్ గారు నామకరణం గావించారు.

విదేశాలలో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి కోసం పవన్ కళ్యాణ్ మస్తిష్కం నుంచి రూపుదిద్దుకున్నదే SAVVE. 20 ఏళ్ల ప్రాయం వరకు ఇంగ్లండ్ లోనే జీవించి అక్కడే విద్యార్జన చేసి తిరిగి భారత దేశానికి వచ్చిన అరబిందో.. భారత దేశాన్ని పరాయి పాలకుల పాలన నుంచి విడిపించటానికి సంగ్రామం ఒనరించిన గొప్ప స్వాతంత్ర యోధుడు. ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసీఎస్) వంటి ఉన్నత చదువులు చదివి పరాయి పాలకులు ఇచ్చిన ఐసీఎస్ పట్టాను త్యజించిన దేశ భక్తుడు అరబిందో. బ్రిటీష్ సేనల నుంచి తప్పించుకోవడానికి ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న పాండిచ్చేరికి తరలిపోయి పోరాటాన్ని చేసిన యోధుడాయన.

భారతీయ తాత్విక ఆధ్యాత్మిక చింతన.. సనాతన ధర్మం పట్ల చెదురులేని అనురక్తి కలిగిన అరబిందో ఒక నాటికి భారత దేశం విశ్వానికి గురువుగా మారుతుందని, ప్రపంచానికి మార్గదర్శిగా వెలుగొందుతుందని ఊహించిన గొప్ప దార్శనీకుడు. అదే విధంగా మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి తెలియని తెలుగు వారు ఉండరనడం అతిశయోక్తి కాదు. అక్షరాలనే ఆయుధాలుగా మార్చుకుని కార్మిక, కర్షక, అణగారిన వర్గాల కోసం పోరాటం సలిపిన అక్షర యోధుడు. నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను అంటూ అక్షర ఆయుధాలు అందించి విశ్వానికి పయనమైన మహా కవి శ్రీశ్రీ.వీరి స్ఫూర్తితో ఏర్పాటవుతున్నదే SAVVE. భారతీయ విశిష్టతను విదేశాలలో చాటి చెప్పడంతో పాటు విదేశాలలో స్థిరపడిన(ఎన్ఆర్ఐ) వారందరికీ ఒక విశ్వ వేదిక ఈ SAVVE. ఎన్ఆర్ఐ లందరికీ SAVVE సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన తొలి తరం స్వాతంత్రోద్యమ నాయకుడు శ్రీ అరబిందో పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper