spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR Oscar Award 2023 : తెలుగు జాతి గర్వపడే సమయం..#RRR 'నాటు నాటు' పాటకి...

RRR Oscar Award 2023 : తెలుగు జాతి గర్వపడే సమయం..#RRR ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు

RRR Oscar Award 2023 : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కించుకొని సంచలనం సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ అవార్డు వస్తుందా రాదా అని బాషా , ప్రాంతం తో సంబంధం లేకుండా ప్రతీ ఇండియన్ ఎంతో ఆతృతగా ఎదురు చూసారు.ఎలా అయినా ఈ అవార్డు రావాలని వాళ్ళు కొలిచే దేవుళ్ళకు మొక్కుకున్నారు కూడా.వాళ్ళ మొక్కులు మొత్తానికి ఫలించాయి.#RRR చిత్రం లోని నాటు నాటు పాటకి గాను ఆస్కార్ అవార్డు దక్కింది.

ఇది నిజంగా తెలుగు జాతి మొత్తం ఎంతో గర్వించదగ్గ విషయం.నిన్న మొన్నటి వరకు మా ఇండస్ట్రీ గొప్ప అంటే మా ఇండస్ట్రీ గొప్ప అంటూ గొడవలు వేసుకున్న సినీ అభిమానులందరూ, ఇలా ఒకే తాటి పైకి వచ్చి గర్వంగా ఇది మా ఇండియన్ సినిమా అని చెప్పుకునేలా చేసింది మన తెలుగు సినిమా.

ఈ పాట ఈ రేంజ్ లో ఖండాలను దాటి రీచ్ అయ్యి ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడానికి ప్రధాన కారణం కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని చెప్పొచ్చు.ఆయనే ఇంత అద్భుతమైన స్టెప్స్ ని కంపోజ్ చేసి ఉండకపోతే ఈరోజు ఈ పాటకి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు.ఆ తర్వాతి క్రెడిట్ మాత్రం రామ్ చరణ్ – ఎన్టీఆర్ లదే.వాళ్ళ వల్లే ఈ పాటకి ఈ రేంజ్ రీచ్ వచ్చింది.

భాష, దేశంతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ సాంగ్ కి లేచి ఎగురుతున్నారు అంటే వీళ్ళే కారణం.ఇక మూడవ క్రెడిట్ మాత్రం కీరవాణీదే.ఆయనే కనుక ఇంత ఫాస్ట్ బీట్ సాంగ్ కంపోజ్ చేసి ఉండకపోతే అసలు పాటే ఉండేది కాదు.ఇక్క పర్ఫెక్షన్ కోసం పరితపించే రాజమౌళి కి క్రెడిట్ ఇవ్వకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా?, ఆయన వల్లే హీరోలిద్దరు అంత సింక్ తో డ్యాన్స్ వేసి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా చేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Oktelugu Epaper