Pawan Kalyan Prabhas Multi-starrer : పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు ఒక్కొక్క స్టార్ హీరో ప్లాన్ చేసుకుంటున్న కాంబినేషన్స్ చూస్తుంటే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఒకప్పుడు మల్టీస్టార్రర్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు భయపడేవారు. ఒకవేళ మల్టీస్టార్రర్ చేసినా సీనియర్ హీరో, ప్రస్తుత తరానికి చెందిన స్టార్ హీరోలను పెట్టి సినిమా చేసేవారు. కానీ #RRR తర్వాత ఇలాంటి సేఫ్ గేమ్స్ కి తెరపడినట్టే. ఏకంగా ప్రస్తుత తరానికి చెందిన సూపర్ స్టార్స్ కలిసి మల్టీస్టార్రర్ సినిమాలు చేసేస్తున్నారు. మన టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలవబడే ప్రభాస్(Rebel Star Prabhas), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మల్టీస్టార్రర్ చిత్రం ఫిక్స్ అయ్యిందని, దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడని, ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తున్న వార్త. కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే వార్త మనమంతా విన్నాము.
పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ బిజీ కి అంత పెద్ద స్టార్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వగలడా?, ఎలా సాధ్యం అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. బహుశా ఇది రూమర్ అయ్యుండొచ్చు అని అనుకున్నారు. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. కానీ ఇది సింగల్ స్టార్రర్ కాదు, మల్టీ స్టార్రర్ మూవీ. రెండు నెలల క్రితమే లోకేష్ కనకరాజ్ రజినీకాంత్, కమల్ హాసన్ లతో ఒక మల్టీస్టార్రర్ సబ్జెక్టు తీసే ప్రయత్నాలు చేసాడు. ఇద్దరి హీరోలకు ఈ కథని వినిపించాడు కూడా. కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదు, ఇప్పుడు అదే కథతో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. రీసెంట్ గానే ఈ ఇద్దరి హీరోలను కలిసి కథ ని వినిపించగా, ఇద్దరికీ బాగా నచ్చిందట.
ఈ చిత్రం లో ఇద్దరు హీరోలు గ్యాంగ్ స్టర్స్ గా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో కనపడడం మీరంతా చూసే ఉంటారు. ఈ లుక్ ఈ చిత్రం కోసమేనట. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ హీరో గా DC అనే చిత్రం లో నటించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక పక్క ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంటూనే, మరోపక్క పవన్ కళ్యాణ్, ప్రభాస్ మల్టీస్టార్రర్ మూవీ కి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాడట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.