మంచు విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలని.. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్లంతా లేదు మీ సినిమా బడ్జెట్ అని ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడిన ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఒక ప్రముఖ న్యూస్ చానెల్ లైవ్ కొచ్చిన ప్రకాష్ రాజు ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికలు, విష్ణు, నరేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

మంచు విష్ణు, నరేష్ లకు పొలిటికల్ ఎజెండా ఉంటే మీరు చూసుకోండి.. పవన్ సినీ నటుడు, ఆయన రాజకీయ అజెండా మాకొద్దు.. ‘పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా’ అంటూ నన్నెందుకు లాగుతున్నారు? అంటూ ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు.
పవన్ కు, నాకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారని.. అయితే సినిమా విషయానికొస్తే నేను నంద.. ఆయన బద్రి.. మేం అంతా ఒఖ్కటే అని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.
మా ఎన్నికల్లో జగన్ ను, కేసీఆర్ ను లాగవద్దని.. వారు వారి బిజీల్లో ఉన్నారని.. ప్రకాష్ రాజ్ అన్నారు. తాను చెప్పని మాటలను చెప్పానని సినీ నటుడు ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అబద్దాలు ఆడుతున్నారని.. ఆయన మార్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలని.. మొదట ఆయన సినీ నటుడు ఆ తర్వాత రాజకీయ నాయకుడు విష్ణు జాగ్రత్తగా మాట్లాడాలని ప్రకాష్ రాజ్ అన్నారు.