Mahesh and Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా అప్ డేట్ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. కేవలం ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేసేలా త్రివిక్రమ్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. అంటే.. షూటింగ్ ను మూడు నెలల్లో పూర్తి చేస్తారు. మహేష్ లాంటి హీరో సినిమా ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యమయ్యే పని కాదు.

కానీ త్వరగా సినిమాని ఫినిష్ చేయాల్సిందిగా మహేషే త్రివిక్రమ్ ను కోరాడట. కారణం.. మహేష్ తన తర్వాత సినిమాని రాజమౌళితో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ సినిమాని త్వరగా ముగించుకుని.. జక్కన్న సినిమా పై వెళ్లిపోవాలని మహేష్ డేట్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా షెడ్యూల్స్ ప్లాన్ పై కిందామీదా పడుతున్నాడు.
ఈ నెల మూడో వారం నుంచి షూట్ మొదలు పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. మహేష్ కూడా అందుకు అనుగుణంగా డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. అందుకే, సినిమా కథలో కూడా యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ రాశాడట.
అలాగే త్రివిక్రమ్ ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాడు. యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఆ సామాజిక అంశం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందట. ఇక మరోపక్క త్రివిక్రమ్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పటికే, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తో త్రివిక్రమ్ కి పదిరోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా కూర్చున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించబోతుంది.