spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Strong Counter to CM Jagan: మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవ ఆపరేషన్లు.....

Pawan Kalyan Strong Counter to CM Jagan: మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవ ఆపరేషన్లు.. ఏపీ విద్యుత్ కోతలపై పవన్ తీవ్ర ఆగ్రహం

Pawan Kalyan Strong Counter to CM Jagan: పవర్ స్టార్ ఏపీలో లేని ‘పవర్’ గురించి ఏకిపారేశారు. చంద్రబాబు హయాంలో 24 గంటలు ఉన్న కరెంట్ జగన్ వచ్చాక ఎందుకు మాయమైందని.. పవర్ హాలీడేలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.

విద్యుత్ అనేది ఇప్పుడు నిత్యావసరంగా మారింది. తెలంగాణలో ఇప్పటికీ పరిశ్రమలు, ఇళ్ల అవసరాలకు 24 గంటలూ కరెంట్ ఇస్తున్నారు. వ్యవసాయానికి అయితే త్రీ ఫేజ్ కరెంట్ 24 గంటలూ ఇచ్చి చరిత్ర సృష్టిస్తున్నారు. కానీ ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీలో విద్యుత్ కోతలకు కారణమయ్యాయి.

చంద్రబాబు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేసుకున్నారు. చీప్ గా కొనాల్సిన కరెంట్ ను ఇప్పుడు యూనిట్ కు రూ.20 చొప్పున కొంటున్నారు. కరెంట్ అందుబాటులో లేక కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టాక తెలంగాణలో కరెంట్ కోతలు ఉంటే.. ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది. 2014-19 మధ్య విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా లేదు. కానీ ఇప్పుడు జగన్ ఆ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడం.. ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచినా కూడా కోతలు వేస్తుండడంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. దాన్నే ఇప్పుడు పవన్ ఎలుగెత్తి చాటాడు.

పల్లెల్లో 11 నుంచి 14 గంటలు కరెంట్ కోత.. పట్టణాల్లో 5-8 గంటలు, నగరాల్లో 4-6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు ఈ ఎండాకాలం పూట విధిస్తుండడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విద్యార్థులకు పరీక్షల వేళ ఈ కోతలు వారి చదువులను పాడు చేస్తున్నాయి.

ఇక కరెంట్ లేక మొబైల్ ఫోన్ వెలుతురులో ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్తాయిలో ఉందో అర్థమవుతుందని పవన్ పేర్కొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper