Samantha: సమంత మంచి వ్యాపారవేత్తగా కూడా రాణించాలని ఆశ పడుతుంది. అందుకే, తను సంపాదిస్తున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సామ్ తాజాగా ఓ ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా జాయిన్ అయ్యింది. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెడుతూ దానికి సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించింది.

పైగా ఈ సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీకి సామ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండనుంది. గతేడాది జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణ సహిత వస్తువుల్ని మాత్రమే అమ్ముతారు. అలాగే దుస్తులు, ఇంటీరియర్ డెకరేషన్ నుంచి హెల్త్ ప్రాజెక్టులతో పాటు అనేక సౌందర్య ఉత్పత్తులు.. ఇలా ఎన్నో రకాల ఉత్పత్తుల్ని ఈ సైట్ లో అందుబాటులో ఉంచుతున్నారు.
మొత్తానికి సమంత వ్యాపారంతో పాటు వరుసగా సినిమాలను ఓకే చేసేస్తోంది. ఇప్పుడు సమంత ఒక్కో సినిమాకు 3 కోట్లు వరకు తీసుకుంటుంది. ఎలాగూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇక వ్యక్తిగత ఇబ్బందులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్స్ తో మరో సిరీస్ చేయడానికి రెడీ అవుతుంది.

అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో సమంత కొత్త లుక్ లో కనిపించబోతుంది. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్ లో ఆమె తెగ కష్టపడిపోతుందని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా తన ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది సామ్.