Nitish Kumar : నితీష్ కుమార్.. అలియాస్ పల్తూరామ్.. ఎన్ని సార్లు పల్టీకొడుతాడో చెప్పలేం.. ఇండియా కూటమి కన్వీనర్ గా ఉన్న నితీష్ ఇప్పుడు కాంగ్రెస్ ను వదిలి ఎన్టీఏ కూటమి బీజేపీలోకి వస్తాడట.. ఒకసారి నితీష్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడు. 1975-79 వరకూ జనతా పార్టీలో కొనసాగారు.
జనతా పార్టీ చీలిపోయాక లోక్ దళ్ లో చేరారు. లోక్ దళ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లోక్ దళ్ 1979-89 వరకూ లోక్ దళ్ లోనే నితీష్ కొనసాగారు. ఆ తర్వాత వీపీ సింగ్ ఆధ్వర్యంలోని జనతా పార్టీలో 94 వరకూ కొనసాగారు. ఇక 1994 తర్వాత 2003 వరకూ సమతా పార్టీ పెట్టి అందులో కొనసాగారు.
2003 నుంచి బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక, ఇంకో రాష్ట్రం, బీహార్ కలిసి జనతాదళ్ (యూనైటెడ్) అని పెట్టారు. బీహార్ లో జనతాదళ్ ను పట్టుకొని అన్ని పార్టీలకు సపోర్టు చేస్తూ బతికేస్తున్నారు.
ఓ వైపు ఎన్డీఏ కూటమిలో ఉంటూ.. ఇప్పుడు ఇండియా కూటమికి సపోర్టు చేస్తూ ఎప్పటికప్పుడు జనతాదళ్ పార్టీ తరుఫున బీహార్ ముఖ్యమంత్రిగా ఇన్నాళ్లు కొనసాగుతూ వస్తున్నారు.
‘పల్తూరామ్’ నితీష్ మరో పల్టీ గా మారిన ‘నీతీష్ కుమార్’ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.