https://oktelugu.com/

PM Modi : మోడీ లక్షదీవుల పర్యటనతో జాతీయ భావాలు పెల్లుబికాయి

మాల్దీవుల చరిత్ర.. మోడీ లక్షదీవుల పర్యటనతో రాజుకున్న వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2024 5:25 pm

    PM Modi : మాల్దీవులు వర్సెస్ లక్షదీవులు.. దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది. అసలు ఇదేంటి? మాల్దీవులు ఎందుకు భారత్ కు వ్యతిరేకంగా తయారయ్యాయి. మాల్దీవులు గతంలో భారత్ లో భాగంగానే ఉండేవి. చరిత్ర చెబుతుంది ఇదే.. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ హయాంలో ఇవి భారత్ లోనే అంతర్భాగంగా ఉండేవి.

    మొదట బుద్దిజం ఉండేది.. ఆ తర్వాత ఇస్లాం పరిపాలనలోకి మారింది. ఎందుకిలా మారిందని చరిత్ర చూస్తే.. మాల్దీవులకు గతంలో భారత్ తో మంచి సంబంధం ఉండేది. ఆ దేశానికి చెందిన మహ్మద్ గయూమ్.. 1978-2008 వరకూ మిలటరీ నియంతగా మాల్దీవులును పాలించారు. ఈయన సమాజాన్ని రాడికలైజ్ చేశారు. పాకిస్తాన్ , సౌదీ నుంచి విద్యావిధానాన్ని తీసుకొని సున్నీ ఇస్లామిక్ ను నేర్పారు. వాహబిజం మాల్దీవుల్లో ప్రవేశించింది..

    వాహబిజం అనేది రాడికల్ ఇస్లాం అభివృద్ధి కావడానికి.. ఐసిస్, ఆల్ ఖైదా వైపు వెళ్లడానికి కారణమైంది. ఐఎస్ఐఎస్ లో 600-700 మంది మల్దీవుల నుంచే వెళ్లారు. అమెరికా అందుకే మాల్దీవుల వ్యక్తులు, సంస్థలను బ్యాన్ చేసింది..

    మాల్దీవుల చరిత్ర.. మోడీ లక్షదీవుల పర్యటనతో రాజుకున్న వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    మోడీ లక్షదీవుల పర్యటనతో జాతీయ భావాలు పెల్లుబికాయి || PM Modi || India-Maldives row || Ram Talk