UPI Payments: నేటి కాలంలో ప్రతీ రంగం వారు టెక్నాలజీని విపరీతంగా ఉపయోగిస్తూ ఈజీగా వర్క్ చేస్తున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సాంకేతికాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డిజిటలైజేషన్ తో మనీ ట్రాన్స్ ఫర్ ను సులభతరం చేసింది. ఒకప్పుడు వస్తువులు కొనుగోలు చేయడానికి చేతిలో నగదు తీసుకెళ్లేవారు. అలాగే ఇతరులకు మనీని ఇవ్వాలంటే కూడా బ్యాంకుకు వెళ్లి నగదును విత్ డ్రా చేసుకొని చెల్లించేవారు. కానీ టెక్నాలజీ వచ్చిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఈజీగా పేమేంట్ చేస్తున్నారు. అయితే బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంటేనే మనీ ట్రాన్స్ ఫర్ సాధ్యమవుతుంది. ఒకవేళ బ్యాంకులో డబ్బులు లేకుండా పేమేంట్ చేయొచ్చా? అదెలాగా?
మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆన్ లైన్ పేమేంట్ కు అలవాటు పడ్డారు. అయితే బ్యాంకు అకౌంట్ తో మొబైల్ లింక్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఆ తరువాత బ్యాంకులో సరిపడా నగదు ఉంటేనే ఇతరులకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా ఇప్పుడు నగదును ఇతరులకు చెల్లించవచ్చు. అలాగే వస్తువులను కొనగోలు చేయొచ్చు. అదే UPI Now Pay Later. ఇది ఓవర్ డ్రాఫ్ట్ లాగే పనిచేస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా యూపీఐ పేమెంట్ లో కొత్త మార్పులు తీసుకొచ్చింది. UPI Now Pay Later ద్వారా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు లేకపోయినా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని 45 రోజుల లోపు తిరిగి బ్యాంకుకు చెల్లించాలి. ఈ కాలంలో డబ్బు వాడుకున్నందుకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయవు. కొన్ని బ్యాంకులు మాత్రం మినిమం ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే దీనిని ముందుగానే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ICICI బ్యాంకు ద్వారా యూపీఐ చెల్లించేవారేతై ఇంటర్నెట్ బ్యాంకు లోకి వెళ్లగానే UPI Now Pay Later ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఖాతాదారుడి ప్రొఫైల్ ను భట్టి డబ్బును లిమిట్ ఇస్తారు. ఇక UPI Now Pay Later నుయాక్టివేట్ చేసుకోవడానికి ఈ బ్యాంక్ రూ.500తో పాటు జీఎస్ టీ ని అదనంగా చార్జీ చేస్తుంది. దీని ద్వారా రూ.3000 లోపు తీసుకొని 45 రోజుల్లోగా చెల్లిస్తే ఎటువంటి చార్జీలు వసూలు చేయవు. కానీ అంతకంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రం 3 శాతం వడ్డీని విధిస్తారు. అలాగే HDFC బ్యాంకు UPI Now Pay Later ను యాక్టివేట్ చేసుకుంటే 199 ప్లస్ జీఎస్ ని అదనంగా విధిస్తుంది.