Zee Sony Merger: ప్రముఖ మీడియా దిగ్గజం గా పేరుగాంచిన సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. భారత్ కు చెందిన జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ కి భారీ షాక్ ఇవ్వనుందని సమాచారం. ఈ మేరకు జీతో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని సోనీ రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
సోని గ్రూప్ జపాన్ కి చెందిన డైవర్సి ఫైడ్ దిగ్గజంగా ఉంది. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని తెలుస్తోంది. దానికి కారణం ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర మరియు ఆయన కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని సమాచారం.
అయితే 2021 వ సంవత్సరంలో జీ మరియు సోనీ ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సోనీ – జీ విలీనం తరువాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్ తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈవో ఎన్పీసింగ్ తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది.
అయితే ఈ విలీన ప్రక్రియ చివరి దశలో ఉన్న సమయంలో గత సంవత్సరంలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, సీఈవో పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రూప్ ఛైర్మన్ , అతని కుమారుడు ఏ నమోదిత సంస్థలో కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోనీ మరియు జీలో సందిగ్ధత చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోందని సమాచారం. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంది.. ఒప్పందాన్ని ముగించేందుకు ఈనెల 20 వరకు పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ భావిస్తోందంట. గడువులోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.