Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: దటీజ్ సూపర్ స్టార్.. హ్యాట్సాఫ్ టు మహేష్ బాబు.. నువ్వు...

Mahesh Babu: దటీజ్ సూపర్ స్టార్.. హ్యాట్సాఫ్ టు మహేష్ బాబు.. నువ్వు దేవుడివి సామీ !

Mahesh Babu: హిట్ సినిమాలు పడితే ఎవరైనా స్టార్ అవ్వొచ్చు, ఆ హిట్స్ కి బ్లాక్ బస్టర్స్ తోడైతే సూపర్ స్టార్ కూడా అవ్వొచ్చు. కానీ, హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నంత మాత్రాన మహేష్ బాబు అవ్వటం కుదరదు. స్టార్ హీరోల ఇమేజ్ కు మించిన అట్రాక్షన్ మహేష్ సొంతం. హాలీవుడ్ హీరోలు కూడా, మహేష్ కటౌట్ ముందు కంటెంట్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లా కనిపిస్తారు, అదీ మహేష్ బాబు రేంజ్.

Mahesh Babu
Mahesh Babu

అందుకే, మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మాత్రమే కాదు, అంతకు మించి. అసలు మహేష్ అంటేనే.. ఉత్సాహంతో ఉరకలు వేయించే సాహసం. మహేష్ కనిపిస్తే చాలు, ఫ్యాన్స్ ఊగిపోతారు, మహేష్ కోసం ఎంతదూరమైనా సాగిపోతారు. తమ హీరో కోసం పాలాభిషేకాలు చేసిన ఫ్యాన్స్ ను చూశాం. కానీ, ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడే ఫ్యాన్స్ ను, ఒక్క మహేష్ అభిమానుల్లోనే చూడగలం.

Also Read: Anchor Sravanthi Prashanth: యంగ్ యాంకర్ బోల్డ్ షో .. పట్టించుకునే నాథుడే లేడు

సర్కారు వారి పాట టాక్ పై మహేష్ ఫ్యాన్స్ తాజాగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. తమ హీరో చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం చెబుతూనే.. దేనికైనా సిద్ధం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏమిటో మహేష్ ఫ్యాన్స్ మాటల్లోనే.. ‘మా హీరో సినిమాకు రాజకీయ రంగులు పూలమాలని చూశారు, దుష్ప్రచారం చేశారు. చేసిన వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాం. నా కొడకల్లారా.. ముందు ముందు మీకు మోతమోగించక పోతే, మేము ఒక అమ్మా అబ్బకు పుట్టినట్లే కాదు’ అంటూ మహేష్‌ బాబు డై హార్ట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

మహేష్ మాత్రం ఈ దుష్ప్రచారాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. మహేష్ అంటేనే పట్టుదల, ఒకసారి గమ్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనుదిరగడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగిపోడు. ప్రతి మలుపును గెలుపుగా మార్చుకునే వరకూ మహేష్ పోరాడతాడు. పోటీపడతాడు. ఇదే మహేష్ లోని ప్రత్యేకత.

Mahesh Babu
Mahesh Babu

నిజంగా సూపర్ స్టార్, మిగతా స్టార్స్ కంటే భిన్నం. మహేష్ మేనియా రొటీన్ గా సూపర్ హిట్ చిత్రాల కారణంగా పుట్టింది కాదు. ఎందుకంటే.. పుడుతూనే మహేష్ సూపర్ స్టార్. ఏ హీరోని అయినా హిట్లు వచ్చాకే స్టార్ అంటారు, కానీ ఒక్క మహేష్ బాబును మాత్రమే, సినిమాలు చేయకముందు నుంచే స్టార్ అన్నారు. అదీ మహేష్ బాబు ఇమేజ్.

Also Read: Mahesh- Trivikram: మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ సంగతులు

ఏ హీరోలో లేని ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కారణంగానే.. మహేష్ బాబు నెంబర్ వన్ హీరో అయ్యాడు. తెలుగు తెర పై అత్యంత జనాకర్షణ కలిగిన నిజమైన స్టార్ హీరో అయ్యాడు. అభిమానుల ప్రేమ సాగరంలో ఆకాశమంతా ఎగసిన తరంగం అయ్యాడు, అభిమానుల హృదయాకాశంలో మెరిసే నక్షత్రంగా నిలిచిపోయాడు. దటీజ్ సూపర్ స్టార్.

అయితే, మహేష్ తన మేనియాని ఏనాడూ ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించుకోలేదు. మహేష్ ను చూసి ప్రేక్షకులు మహేష్ అభిమానులుగా మారారు. ఫ్యాన్స్ తో సినిమాల వరకు మాత్రమే బంధం కాకుండా … రియల్ లైఫ్ లో కూడా అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రియల్ హీరో ‘మహేష్ బాబు’.

Mahesh Babu
Mahesh Babu

ఇప్పటికే కొన్ని వేలమంది చిన్నారులకు మహేష్‌ బాబు గుండె ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడాడు. పైగా ప్రతి ఏడాది ఇంకా వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తునే ఉన్నాడు. వైద్యో నారాయణో హరీ అని, వైద్యుడిని దేవుడితో పోల్చారు పెద్దలు. డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేసిన వైద్యులే దేవుళ్లు అయినప్పుడు, ఇక సొంత డబ్బుతో వైద్యం చేయిస్తున్న మహేష్ ను ఏమనాలి ? అందుకే, మహేష్ తమకు దేవుడికి మించి అని అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. నిజంగానే మహేష్ దేవుడిలానే ఎందరో చిన్నారులకు ప్రాణదాతగా నిలిస్తున్నాడు. హ్యాట్సాఫ్ టు మహేష్ బాబు.

Also Read:Nayanthara Marriage: నయనతార పెళ్లి వేదిక, ముహూర్తం డిటైల్స్ ఇవే !
Recommended Videos
మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్  || Mahesh Babu Fans Strong Warning To Negitve Talks
నువ్వింక మారవా జగన్ || Bolisetty Satyanarayana Counter to CM Jagan || Janasena vs YCP || Ok Telugu
మహేష్ బాబు సినిమా కు తప్పని తిప్పలు |Trivikram Mahesh Babu Next Movie Update |Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version