https://oktelugu.com/

Jammu Kashmir : కాశ్మీర్ లో స్థానిక ఉగ్రవాదులు తగ్గారు, పాక్ ఉగ్రవాదులు పెరిగారు

కాశ్మీర్ లో స్థానిక ఉగ్రవాదులు తగ్గారు, పాక్ ఉగ్రవాదులు పెరిగారు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2023 7:42 pm
    Follow us on

    Jammu Kashmir : కాశ్మీర్ లో ఉగ్రవాదం పెరుగుతోందా? తగ్గుతోందా? అంటే బాగా తగ్గిందనే చెప్పాలి. సాధారణ కార్యక్రమాలకు ఎక్కడా ఆటంకం కలగడం లేదు. ఒక విధంగా చాలా రోజుల క్రితం కన్నా చాలా నార్మల్ స్టేజీకి వచ్చింది. ఈ సంవత్సరం 2 కోట్లకు పైగా టూరిస్టులు రాబోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

    కాలేజీలు మూతపడడం లేదు. ప్రభుత్వ ఆఫీసులు మూతబడడం లేదు. బంద్ లు, ఆందోళనలు లేవు. స్వేచ్ఛగా అర్ధరాత్రి వరకూ జనం శ్రీనగర్ వీధుల్లో తిరుగుతున్నారు. వీటన్నింటిని చూస్తే నార్మల్ స్టేజీకి వచ్చినట్టే..

    కానీ ఉగ్రవాదులు హతమవుతున్నారు. భద్రతా దళాలు చనిపోతున్నారు. పౌరులు చనిపోతున్నారని వార్తలు వచ్చాయి. జమ్మూలోని రాజోళిలో మొత్తం ఐదుగురు చనిపోయారు. అక్టోబర్ నుంచి 26 మంది రాజోరీ, పూంచ్ ఈ రెండు జిల్లాల్లోనే చనిపోయారు. కశ్మీర్ లో ప్రశాంతత వచ్చింది. జమ్మూ నగరంలోనూ బాగానే ఉంది. సరిహద్దు జిల్లాలైన రాజోరీ, పూంచ్ జిల్లాలోనే ఉగ్రవాదులు నక్కి దాడి చేస్తున్నారు.

    భద్రత దళాలు జనజీవనం సాధారణ స్థితికి వచ్చేలా చేశారు. కశ్మీర్, జమ్మూలో ఉగ్రవాదాన్ని అరికట్టారు. స్థానికులు ఎవరూ ఉగ్రవాదంలో చేరడం లేదు. ఒకనాటితో పోలిస్తే చాలా తగ్గింది. ఉగ్రవాదంపై స్థానికుల్లో వ్యతిరేకత వచ్చింది. పాకిస్తాన్ మాత్రం దీన్ని సహించడం లేదు. ఎలాగైనా సరే పాకిస్తాన్ జాతీయులను తీసుకొచ్చి సరిహద్దులు దాటించి జమ్మూలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు. కశ్మీర్ లో పటిష్ట భద్రత ఉంటుంది. జమ్మూలో చలికాలంలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. దట్టమైన అడవులు, కొండలు, గుహలు ఉన్నాయి. అందుకే జమ్మూ లో దాగి మన భద్రత దళాలను చంపేస్తున్నారు.

    కాశ్మీర్ లో స్థానిక ఉగ్రవాదులు తగ్గారు, పాక్ ఉగ్రవాదులు పెరిగారు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

    కాశ్మీర్ లో స్థానిక ఉగ్రవాదులు తగ్గారు, పాక్ ఉగ్రవాదులు పెరిగారు | Jammu Kashmir | Rajouri | RamTalk