Narendra Modi : తెలంగాణ ఎన్నికలకు ఇంకా కేవలం 5 రోజులే ఉన్నాయి. ఈ ఐదు రోజులే అతి కీలకం.. ఒకటి ఈరోజు నుంచి మోడీ విస్తృతంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడురోజుల్లో 6 సభలు, హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు. ఇది ఏ మేరకు తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేయబోతోంది.
బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పూర్తిగా పడిపోయింది అనుకున్నాక.. మోడీ వచ్చి మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో ప్రసంగాలతో బీజేపీ క్యాడర్ లో అత్యంత ఉత్సాహం వచ్చింది. దానికి కొనసాగింపుగా బీసీ సదస్సు పెట్టి బీసీ సీఎం నినాదం ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ సభకు వచ్చి ఎస్సీ వర్గీకరణపై చేసిన ప్రకటన సంచలనమైంది. బీజేపీకి ఊపు తెచ్చిన ఘనత మోడీదే.
మోడీ ఇప్పుడు తెలంగాణలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. 25,26,27వ తేదీల్లో మోడీ పర్యటనలతో బీజేపీకి వేవ్ మారనుంది. బీజేపీకి బలమున్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టారు. మోడీ వస్తే అది సీట్లుగా కనర్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
ఈసారి సామాజిక తెలంగాణ ప్రభావం ఉండబోతోందా? బీసీ సీఎం నినాదం బీజేపీకి పనిచేస్తుందా? అన్నది చూడాలి.
సామాజిక తెలంగాణా, మోడీ ప్రచారం కీలకం కాబోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.