Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi: పొలిటికల్ హీట్.. చిరంజీవితో మాజీ మంత్రుల భేటీ

Chiranjeevi: పొలిటికల్ హీట్.. చిరంజీవితో మాజీ మంత్రుల భేటీ

Chiranjeevi: ఏపీలో ఓ ఘటన హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల నుంచి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవితో మాజీ మంత్రులు ఇద్దరు ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ సెట్ లోకి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ వెళ్లారు. ప్రత్యేకంగా చిరంజీవితో సమావేశమయ్యారు. దీంతో ఈ భేటీ పొలిటికల్ హీట్ పుట్టించింది. ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించేందుకే వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నా.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

గంటా శ్రీనివాసరావు, చిరంజీవి మంచి మిత్రులు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీన సమయంలో గంటాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటుదక్కింది. చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.చిరంజీవి మెల్లగా రాజకీయాలకు దూరమయ్యారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత తాను ఇక క్రియాశీలక రాజకీయాలకు దూరమని ప్రకటించారు. ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికి ఆయన మాత్రం తాను రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించేనని నిర్మోహమాటంగాప్రకటించారు. రాజకీయ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు .

గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణలు వియ్యంకులు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. కానీ టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. చంద్రబాబు హయాంలో మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించి పొంగూరు నారాయణపై ప్రభుత్వం పలు రకాల కేసులు పెట్టింది. ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి మరోసారి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు ఇటీవలి కాలంలో టీడీపీలో యాక్టివ్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర .. ఇతర అంశాల్లో తరచూ స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్నీ విమర్శిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిద్దరూ కలిసి చిరంజీవితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version